info@manadailynews.com
Breaking News

నేటి నుంచి టీ20 ప్రపంచకప్‌

ICC-T20-World-Cup-2016

సూపర్‌-10 మ్యాచ్‌లో తలపడనున్న భారత్‌ × కివీస్‌
రాత్రి 7.30 నుంచి డీడీ, స్టార్‌ స్పోర్ట్స్‌ 1, 3ల్లో

నేటి నుంచి టీ20 క్రికెట్ ప్రపంచకప్‌ మహా సంగ్రంమం మొదలుకానుంది. తోలి మ్యాచ్ లోనే ప్రమాదకరమైన న్యూజిలాండ్‌తో ధోనీసేనకు తలపడనుంది. ఈ నెల 8న అర్హత మ్యాచ్‌లతో ఆరంభమైన టోర్నీ మంగళవారం కీలకమైన సూపర్‌-10 దశలోకి దూసుకేల్తోంది. బలమైన జట్టుతో, అత్యంత అనుకూల పరిస్థితుల్లో, తిరుగులేని ఫామ్‌తో బరిలోకి దిగుతోంది ధోనీ సేన. రెండవ మ్యాచ్‌ పాకిస్థాన్‌తో జరగనుంది. కివీస్‌ను కొట్టి ఆ పోరుకు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని భావిస్తోంది భారత్‌. 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో ఏమాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగి అనూహ్యంగా కప్పు కొట్టింది ధోనీసేన.
బ్యాటింగ్‌ లైనప్‌లో రోహిత్‌, ధావన్‌, కోహ్లి, రైనా, యువరాజ్‌, ధోని, పాండ్య ఉన్నారు. అందరూ ఫుల్ ఫాంలో ఉన్నారు. ఆసియా కప్‌లో స్పిన్నర్లు పెద్దగా ప్రభావం చూపకపోయినా.. భారత గడ్డపై అశ్విన్‌, జడేజాలతో ప్రత్యర్థులకు చిక్కులు తప్పవు. అవసరమైతే వీరికి యువరాజ్‌, రైనాల అండ కూడా దొరుకుతుంది. స్పిన్‌కు అనుకూలించే నాగ్‌పూర్‌ పిచ్‌పై కివీస్‌ను తిప్పేయడానికి కావాల్సిన వనరులు భారత్‌కు ఉన్నాయి. మొత్తంగా జట్టు అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది.
రెండో టైటిల్‌పై భారత్ కన్ను
2007లో తొలిసారిగా ప్రవేశపెట్టి టీ20 వరల్డ్‌క్‌పలో చాంపియన్‌గా నిలిచిన భారత.. ఆ తర్వాత నాలుగు సార్లు టైటిల్‌ను ముద్దాడలేకపోయింది. ఇప్పుడిది ఆరో కప్‌. దీని ఆతిథ్య హక్కులు తొలిసారిగా భారత దక్కించుకుంది. ఈ టోర్నీకోసమని టీమిండియా బాగానే సన్నద్ధమైంది. ఈ మెగా ఈవెంట్‌ను దృష్టిలో పెట్టుకునే బీసీసీఐ కూడా దేశవాళీ పోటీలను ఎక్కువగా టీ20 ఫార్మాట్‌లో నిర్వహించింది. భారత ఈ మూడు నెలల కాలంలో ఇతర ఫార్మాట్లను కాదని అత్యధికంగా 11 టీ20 మ్యాచ్‌లాడింది. వాటిలో పది విజయాలు సాధించి మెగా టోర్నీకి ముందు వరల్డ్‌ నెంబర్‌వన్‌ స్థానాన్ని దక్కించుకుని ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
జట్లు 
భారత్: రోహిత్, ధవన్‌, కోహ్లీ, రైనా, యువరాజ్‌, ధోనీ (కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, జడేజా, అశ్విన్‌, నెహ్రా/షమి, బుమ్రా.
న్యూజిలాండ్‌: గప్టిల్‌, విలియమ్సన్‌ (కెప్టెన్‌), కొలిన్‌ మన్రో, కోరె ఆండర్సన్‌, రాస్‌ టేలర్‌, ఇలియట్‌, లూక్‌ రోంచి (వికెట్‌కీపర్‌), మిచెల్‌ సాంట్న ర్‌, నాథన్‌ మెకల్లమ్‌/సోధి, క్లెనెగన్‌/మిల్నె, బౌల్ట్‌.

పిచ్‌, వాతావరణం
నాగ్‌పూర్‌లో మంగళవారం వర్షం కురిసే అవకాశాలు లేవు. కానీ.. సాయంత్రం నుంచి రాత్రి 11 గంటల వరకూ ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ నివేదిక చెబుతోంది. ఇక ఈ మ్యాచ్‌కు సిద్ధం చేసిన పిచ్‌పై ఆరంభంలో కాస్త స్వింగ్‌ లభిస్తుంది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

కప్పు గెలిస్తే రూ.23 కోట్లు
టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన జట్టు కప్పుతో పాటు భారీ ప్రైజ్‌మనీని కూడా సొంతం చేసుకుంటుంది. ఈ టోర్నీకి నిర్ణయించిన మొత్తం ప్రైజ్‌మనీ రూ.67 కోట్లు! ఈసారి విజేతకు రూ.23 కోట్ల 48 లక్షల ప్రైజ్‌మనీ దక్కనుంది. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.10 కోట్లు దక్కనున్నాయి. సెమీఫైనల్లో ఓడిన రెండు జట్లకు ఒక్కో జట్టుకు రూ.5 కోట్లు, సూపర్‌-10లో గెలిచిన ప్రతి మ్యాచ్‌కు రూ.33 లక్షలు దక్కనున్నాయి

T20 World cup schedule