info@manadailynews.com
Breaking News

అమ్మ ఆరోగ్యం విషయం

jayalalitha-health

సరిహద్దు రాష్ట్రాల్లో హై అలెర్ట్

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆ పార్టీ నేతలు, అభిమానులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆందోళనతో అమ్మను ఉంచిన అపోలో ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద 3000 మంది పోలీసులు బలగాలు మొహరించారు. ఆస్పత్రి చుట్టుపక్కల ఉన్న హోటల్స్‌, దుకాణాలను కూడా ఖాళీ చేయించారు. సీఎం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో విద్యా సంస్థలు ఈ రోజు ఉదయమే సెలవు ప్రకటించాయి. అమ్మ పరిస్థితి ‘వెరీ క్రిటికల్’ అని హెల్త్ బులిటెన్ విడుదల అనంతర ఉద్రిక్తలు తలెత్తకుండా తమిళనాడు రాష్ట్ర సరిహద్దు రాష్ట్రాలను కేంద్ర సర్కారు అప్రమత్తం చేసింది. జాతీయ రహదారుల్లో తనిఖీలు చేయాలని, భారీ భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. కర్ణాటక సరిహద్దులో బలగాలు భారీగా మోహరించాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలో పోలీసు బలగాలు, పారామిలటరీ దళాలను మోహరించారు.