info@manadailynews.com
Breaking News

డాలరు విలువ 70రూపాయలు

3

డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రోజురోజుకీ పతనమవుతుంది. గత కొన్ని నెలలుగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న రూపాయి మారకం విలువ మంగళవారం మరింత దిగజారి రూ.70కి చేరింది. టర్కీలో ఆర్థిమ మాంద్యం వదంతుల నేపథ్యంలో ఆదేశ కరెన్సీ భారీగా పతనమౌతుంది. దీంతో ఆ ప్రభావం మన కరెన్సీపై పడింది. యూఎస్‌ కరెన్సీ దిగుమతిదార్లు, బ్యాంకర్ల నుంచి డిమాండ్‌ బాగా పెరగడంతో రూపాయి బలహీన పడుతోందని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు.
నేడు స్టాక్‌మార్కెట్లు లాభాల్లో నడుస్తున్నాయి. ప్రస్తుతం ఉదయం 11.15 సమయంలో సెన్సెక్స్‌ 133 పాయింట్ల లాభంతో 37777.96 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 11402.75 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.