info@manadailynews.com
Breaking News

తెలంగాణ

తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య

SI died

సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం కుక్కునూరు పోలీస్‌స్టేషన్‌లో పది నెలల్లో ఇద్దరు ఎస్‌ఐలు ఆత్మహత్య చేసుకోవడం పోలీస్‌శాఖలో చర్చనీయాంశమైంది. బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న ప్రభాకరర్‌రెడ్డి తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్టేషన్ లోనే తన గదిలో కుర్చీపై కూర్చుని తుపాకీతో తలపై కాల్చుకున్నాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ఇది ఇలా ఉండగా ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈయన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరుకు చెందిన ప్రభాకర్‌రెడ్డి 2012లో ఎస్‌ఐగా ఉద్యోగంలో ...

Read More »

సిటీలో పడగ విప్పిన స్వైన్‌ప్లూ

swineflu

హైదరాబాద్‌ సిటీలో స్వైన్‌ఫ్లూ మళ్ళీ కలకలం సృష్టిస్తోంది. మంగళవారం మహాత్మా గాంధీ ఆస్పత్రిలో పాతబస్తీలోని నవాజ్‌సాబ్‌కుంటకు చెందిన షాహనాబేగం(39) గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. 10 రోజుల్లో ఇద్దరు స్వైన్‌ఫ్లూ వ్యాధితో మరణించారు. ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉంది. యాదాద్రి జిల్లా వలిగొండకు చెందిన మంజుల(35) కూడా 5న మృతిచెందింది. బహదూర్‌పురాకు చెందిన పుష్పలత(64) కూడా స్వైన్‌ప్లూ బారినపడడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. వీరే కాకుండా నగరానికి చెందిన మరో ముగ్గురు స్వైన్‌ప్లూ లక్షణాలతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ఉన్నారు.

Read More »

ఏపీ చెప్పిన‌ట్లే చేద్దామంటున్న‌కేసీఆర్‌

kcr-rajnath-singh

తెలంగాణ సీఎం కె చంద్ర‌శేఖ‌ర‌రావుకు ఏపీ చెప్పిన దానికి సై అంటున్నారు. విభ‌జ‌న త‌ర్వాత ఏపీకి ఏం ఇచ్చేది లేదు పొమ్మంటూ అడ్డం తిరిగిన కేసీఆర్ ఇప్పుడు రెండు రాష్ట్రాల మ‌ధ్య స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకుందామంటూ ప్ర‌తిపాద‌న‌లు తెస్తున్నారు. ఉమ్మ‌డి ఆస్తుల‌, ఉమ్మ‌డి సంస్థ‌ల విష‌యంలో ఏపీని మూడు చెరువుల నీళ్లు తాగించాల‌నుకున్న తెలంగాణ సీఎం…. ఇప్పుడు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలంటూ కేంద్రాన్ని, హోం శాఖ‌ను కోరుతున్నారు. ఈ మేర‌కు ఢిల్లీలో రాజ్‌నాథ్ సింగ్‌ను క‌లిసిన కేసీఆర్ ప‌ద‌వ షెడ్యూల్‌లో ఉన్న సంస్థ‌ల విభ‌జ‌న విష‌యంపై శ్ర‌ద్ధ ...

Read More »

క‌మ‌లం క‌త్తుల‌… కేసీఆర్ స్నేహ‌గీతం!

kcr

ఒక‌ప్పుడు పిలిచినా వెళ్ల‌ని కేసీఆర్‌… ఇప్పుడు పిల‌కుండానే బీజేపీ నేత, కేంద్ర మంత్రి ద‌త్తాత్రేయ ఇంటికి ఎందుకు వెళ్లారు. ఏపీకి వెంక‌య్య నాయుడు మాదిరే తెలంగాణ‌కు ద‌త్త‌న్నే పెద్ద‌న్న అంటూ పొగ‌డ్త‌లు ఎందుకందుకున్నారు. ఒక‌వైపు బీజేపీ చీఫ్ అమిత్ నేరుగా కేసీఆర్‌పైనే తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తుంటే… రాష్ట్ర బీజేపీ నేత‌లు టీఆర్ ఎస్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతుంటే కేసీఆర్ మాత్రం ఢిల్లీలో మకాం వేసి బీజేపీ నేత‌ల‌ను ఎందుకు దువ్వుతున్నారు. వీట‌న్నింటిని ప‌రిశీలిస్తే కేంద్రంలోని బీజేపీతో త‌గ‌వు పెట్టుకుంటే అస‌లుకే మోసం వ‌స్తుంద‌ని కేసీఆర్ గ్ర‌హించిన‌ట్టున్నారు. ...

Read More »

నిజాంపేటలో వరద దృశ్యం

nizampet-floods

ఇదెక్కడో కాదు హైదరాబాద్ నగరంలో ఉన్న నిజాంపేట్ లో కనిపించిన దృశ్యం. కొద్దీ రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నగరం అంత వరదల మాయం ఐంది. అపార్టుమెంట్లు, సెల్లార్లలో కార్లు, బైకులు కూడా పూర్తిగా మునిగిపోయాయి. కూకట్ పల్లి , మియాపూర్, కుత్బుల్లాపూర్, పఠాన్ చెరువులో కూడా ఇలాంటి దృశ్యాలే.

Read More »

ఫిరాయింపుల‌పై స్పీక‌ర్‌కు హైకోర్టు డెడ్‌లైన్‌!

high-court

ముందు వెనుకా లేకుండా ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలంద‌రికీ గులాబీ కండువాలు క‌ప్పేసిన కేసీఆర్‌కు ఉమ్మ‌డి హైకోర్టు షాకిచ్చింది. టీడీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై దాఖ‌లైన పిటిష‌న్‌పై సంచ‌ల‌న ఆదేశాల‌చ్చింది. టీడీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు అధికార‌ప‌క్షంలో విలీనం కావ‌డం చెల్ల‌ద‌ని స్ప‌ష్టం చేసింది. మూడు నెల‌ల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల సంగ‌తి తేల్చాల‌ని కూడా స్పీక‌ర్‌కు గ‌డువు పెట్టి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల‌పై ప్ర‌తిప‌క్ష టీడీపీ హ‌ర్షం వ్య‌క్తం చేసింది. బొటాబొటీ మెజార్టీతో అధికారం చేప‌ట్టిన కేసీఆర్ ప‌ద‌విలో కుదురుకోగానే ప్ర‌తిప‌క్ష పార్టీల వెంట‌ప‌డ్డారు. తెలంగాణ ఇచ్చిన ...

Read More »

కేసీఆర్‌పై క‌త్తులు దూస్తున్న కాంగ్రెస్‌!

kcr-digvijay-singh

కేసీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ క‌త్తులు దూస్తోంది. ఇందుకు బీజేపీ చీఫ్ అమిత్ షా చేసిన విమ‌ర్శ‌ల‌ను ఆయుధాలుగా చేసుకుంటోంది. తెలంగాణ‌కు కేంద్రం ఇస్తున్న వేల కోట్ల రూపాయ‌ల నిధుల‌ను కేసీఆర్ ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నార‌ని అమిత్ షా వ‌రంగ‌ల్ స‌భ‌లో తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. బీజేపీ నేతృత్వంలోని మోడీ ప్ర‌భుత్వం వారానికో కొత్త ప‌థ‌కం తెస్తూ భారీగా నిధుల‌ను రాష్ట్రానికి ఇస్తుంటే ఇక్క‌డున్న కేసీఆర్ ఆ నిధుల‌ను ఎమ్మెల్యేను కొన‌డానికి ఉప‌యోగిస్తున్నార‌ని ఆయ‌న సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. షా చేసిన విమ‌ర్శ‌ల‌ను అధికార పార్టీ నేత‌ల్లో ...

Read More »

తెలంగాణ‌లో టీడీపీ హ్యాపీ!

telangana-tdp

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు తెలంగాణ టీడీపీ నేత‌ల‌ను సంబ‌రాల్లో మునిగేలా చేశాయి. గ‌త కొన్నాళ్లుగా ఎదురు దెబ్బ‌లు తింటున్న ఆ పార్టీ నేత‌ల‌కు హైకోర్టు ఆదేశాల‌తో కొత్త ఊపిరి వ‌చ్చ‌న‌ట్లైంది. టీఆర్ఎస్ అధికారం చేప‌ట్టిన నాటి నుంచి టీడీపీనే అధికార పార్టీ ల‌క్ష్యంగా చేసుకుంది. ఏపీ పార్టీకి ఇక్క‌డేం ప‌నంటూ నేరుగా కేసీఆరే విమ‌ర్శ‌లు గుప్పించేవారు. అదే విష‌యాన్ని జ‌నంలోకి విస్తృతంగా తీసుకెళ్ల‌డంలో టీఆర్ ఎస్ నేత‌లు స‌ఫ‌ల‌మ‌య్యారు. దానికితోడు ఓటుకు నోటు కేసులో రేవంత్‌ను ప్ర‌భుత్వం అడ్డంగా బుక్ ...

Read More »

భాగ్య‌న‌గ‌రితో వీడిన బంధం!

amaravathi

భాగ్య‌న‌గ‌రంతో ఏపీ ప్ర‌జ‌ల బంధం తెగిపోయింది. ఇక‌పై హైద‌రాబాద్ అంటే పోరుగు రాష్ట్ర రాజ‌ధాని కానుంది. చ‌ట్టం ప్ర‌కారం ఉమ్మ‌డి రాజ‌ధానిగా ప‌దేళ్లు ఉండ‌నున్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వాలు, ప్ర‌జ‌ల‌కు హైద‌రాబాద్‌తో బంధం తెగిపోనుంది. ఇందుకు ద‌స‌రానే ముహుర్తం కానుంది. సీఎం విజ‌య‌వాడ‌లో ఉంటున్న‌ప్ప‌టికీ వివిధ శాఖ‌లు హైద‌రాబాద్‌లోనే ఉండిపోవ‌డంతో ప్ర‌జ‌లు ప్ర‌తి ప‌ని కోసం హైద‌రాబాద్‌కు రాక‌పోక‌లు సాగిస్తూనే ఉన్నారు. ఇక అలా ప‌ని కోసం హైద‌రాబాద్ వ‌చ్చే అవ‌స‌రం కూడా ఇక‌పై ఉండ‌దు. కార‌ణం ద‌స‌రా త‌ర్వాత పూర్తిగా రాజ‌దాని కార్య‌క‌లాపాలు వెల‌గ‌పూడి నుంచే ...

Read More »

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అమిత్ యుద్ధం!

kcr-vs-amith-shah

తెలంగాణ‌లో బీజేపీ యుద్ధం ప్రారంభించింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో అమీతుమీ తేల్చుకోవ‌డానికి సిద్ధ‌మైంది. తెలంగాణ విమోచ‌న దినం స‌ద‌ర్బంగా నిర్వ‌హించిన వ‌రంగ‌ల్ స‌భ‌లో బీజేపీ జాతీయ అద్య‌క్షుడు అమిత్ షా స‌మ‌ర‌బేరీ మోగించారు. కేసీఆర్‌పై ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ చేయ‌ని ఆరోప‌ణ‌లు చేశారు. తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. త‌మ నేత‌లు ఫిరాయింపుల‌కు దిగి కేసీఆర్ ప‌క్షాన చేర‌డంతో కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ త‌దిత‌ర పార్టీలు రాష్ట్రంలో కుదేల‌య్యాయి. దాంతో వారు ప్ర‌భుత్వంపై చేస్తున్న పోరు నామ‌మాత్రంగా మారిపోయింది. ఈ ద‌శ‌లోనే అమిత్ షా చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నాత్మ‌కంగా ...

Read More »