info@manadailynews.com
Breaking News

భక్తి

శ్రీ రాముడు ఎప్పుడు పుట్టాడో తెలుసా?

sriramudu

ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామనవమిని జరుపుకోవడం హైందవులకు తరతరాలుగా వస్తోంది. రాముడు చెప్పుకోడానికి సృష్టించిన పాత్ర కాదని, ఆయన మామూలు మనిషిలా సజీవంగా నడయాడిన దేవుడని భారతీయులు నమ్ముతారు. దీనికి అనుగుణంగా రాముడు త్రేతాయుగంలో జన్మించారనీ, ఇన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన పుట్టి ఉంటారనీ కొందరు అంచనాలు కూడా వేస్తూ వచ్చారు. కానీ ఇటీవలి కాలంలో పుష్కర్ భట్నాగర్, ఆయన స్నేహితురాలు సరోజ్ బాల ఈ విషయం మీద చేసిన పరిశోధన విస్తృతంగా ప్రచారాన్ని పొందింది. భారతీయ రెవెన్యూ సర్వీస్ (IRS)లో ...

Read More »

శ్రీరాముడికి విముక్తిని ప్రసాదించిన ప్రాంతం..

mukthi

వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో పెన్నానదిగా పిలువబడే పినాకినీ నది ఒడ్డున వెలసిన ఆలయం ముక్తి రామేశ్వరాలయం. రెండవ కాశీగా పేరు గాంచిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు శ్రీరాముడు బ్రహ్మ హత్యా పాతకం నుండి విముక్తి పొందేందుకు తాన చేతులతో ఇసుక తెచ్చి శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్టించాడని ప్రతీతి. పైగా 56 అంగుళాలుండే శివ లింగం మీద శ్రీ రాముడి వేలి ముద్రలు ఇప్పటికీ ఉన్నాయని అంటారు. పురాణగాధల ప్రకారం లంకాధిపతి రావణుడు బ్రహ్మ‌కు మనుమడు. కానునా బ్రాహ్మణుడు. శ్రీ రాముడు ఆయనను ...

Read More »

చైనాకి గురువు భారతదేశమే

himalayan

ఒకప్పుడు భారతదేశం చైనాకు గురుస్థానంలో ఉండేదా? దీనికి సమాధానం ఆ చైనా వారే ఇస్తున్నారు. లిన్ యుతుంగ్(1895-1976) “ది విజడమ్ ఆఫ్ ఇండియా అండ్ చైనా” అనే పుస్తకం రాశాడు. అందులో మతం, ఆలోచనాసరళి, సాహిత్యం మొదలైన విషయాలలో భారతదేశం చైనాకు గురువు వంటిది అంటాడు. అలాగే విశ్వవిజ్ఞానానికి “త్రికోణమితి”, వర్గసమీకరణాలు, వ్యాకరణం, ఉచ్ఛారణ శాస్త్రం, చదరంగం వంటివి అందించి, ఎందరో తత్వవేత్తలను ప్రభావితం చేసిన భారతదేశ విజ్ఞానం గొప్పది అంటాడు. విలియం జోన్స్ – “చైనీయులు తమ పుట్టుకను హిందువులతో పోల్చుకుంటారు” అని ...

Read More »

సిగ్గుపడిన దేవేరులు శ్రీవారిని చేరగా..

poolabavi

తిరుమలలోని మరో చెప్పుకోదగ్గ ప్రదేశం పూలవనం. రంగు రంగుల పూలు. మనసుకు హాయి పంచుతుంటే ఇక్కడే నేనూ ఉన్నాను అంటూ వందల ఏళ్ల నాటి ఓ భావి తన కథను చెబుతూ ఉంటుంది. అదే పూల వనం లోని పూల భావి. దీనికి ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారు ఓ రోజు ఏకాంతంలో వుండగా తొండమాన్ చక్రవర్తి అక్కడికి వచ్చారట. అది చూసి దేవేరులు ఇరువురు సిగ్గుపడి హడావుడిగా శ్రీదేవి శ్రీవారి వక్షస్థలం చేరుకుంటే, భూదేవి ...

Read More »

ఆ కర్రల అర్థాల అర్థాలు వేరయా…

swamijis

జీయర్ స్వాములు, మరికొందరు సన్యాసులు, స్వామీజీల చేతుల్లో పొడవాటి కర్రలు, వాటికి చివర ఓ చిన్న మూటల్లాంటివి ఉంటాయి ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడూ వారు వాటిని పట్టుకునే ఉంటారు. ఎక్కడికి వెళ్లినా, ప్రవచనాలు చేసినా వారి చేతుల్లోనే ఉంచుకుంటారు. ఇందుకు కారణం అది వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత భావానికి చిహ్నం కావడమే. పైగా వారు పట్టుకున్న కర్రల ఆకారాలకు కూడా చాలా అర్థాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ‘ Y’ ఆకారంగల దండాన్ని, కమండలాన్ని పట్టుకొని ఉండేవారిని ‘తాపసులు’ లేదా ‘ఋషులు’ అని ...

Read More »

ఆగమంలో లేని అమ్మ శ్రీశైలంలో ఉన్నారు..

aagamanam

ఆగమశాస్త్ర ప్రకారం కొన్ని దేవతామూర్తులకు పూజలు చేయరు. అలా ఆ ఆగమంలో లేని వారు అమ్మవారు ఇష్టకామేశ్వరీ. పరమశివుడు ఎలా ఉంటాడో అలాగే ఉంటారు ఆవిడ రూపంలో. అందుకే ఆ తత్వానికి కామేశ్వరి అని పేరు. అసలు భారతదేశం మొత్తం మీద ఇష్ట కామేశ్వరి అన్న మాట లేనే లేదు. ఆ మాటతో ఉన్న మూర్తీ లేదు. ఒక్క శ్రీశైలంలో మాత్రమే ఆమె మనకు కనిపిస్తారు. శ్రీశైలంలోని అటవీ ప్రాంతంలో ఉండే ఈ ఇష్ట కామేశ్వరి దర్శించుకోవడం అంటే అంత సులువైన విషయం కాదు. ...

Read More »

భగవంతుడు ప్రసాదించిన వేదాలు..

vedas

హిందూమతంలో అత్యంత మౌలిక ప్రమాణం వేదాలు. “విద్” అనే ధాతువుకు “తెలియుట” అన్న అర్ధాన్నిబట్టి వేదాలు భగవంతుని ద్వారా “తెలుపబడినవి” అనీ, అవి ఏ మానవులచేతనూ రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుకనే వేదాలను అపౌరుషేయములు అని కూడా అంటారు. హిందూ శాస్త్రాల ప్రకారం వేదాలను ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారు. అందుకే వీటిని శ్రుతులు అని కూడా అంటారు. చతుర్వేదాలు.. ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణవేదము అన్ని వేదాలూ కలిపి 1180 అధ్యాయాలు, లక్షపైగా శ్లోకాలు ఉండాలని అంటారు. కాని ప్రస్తుతం మనకు లభించేవి ...

Read More »

షిర్డీ సాయిబాబా మాటలు

baba

షిర్డీ సాయిబాబా ఎలాంటి హంగులూ, ఆర్భాటాలూ చూపలేదు. మంత్రాలూ తంత్రాలూ ప్రదర్శించలేదు. నిరాడంబర జీవితం గడిపి చూపారు. సాయిబాబాకు మసీదే మహలు అయింది. అందరూ, అన్ని జీవులూ తినగా మిగిలిన పదార్ధాలనే పంచ భక్ష్య పరమాన్నాలుగా భావించారు. షిర్డీ సాయిబాబా మసీదులో స్తంభాన్ని ఆనుకునో, నింబ వృక్షం కిందనో ఏ ఆడంబరాలూ లేకుండా కూర్చుని, శ్యామా, మహల్సాపతి, బయజాబాయి లాంటి భక్తులకు జీవన సత్యాలు బోధిస్తూ ఉండేవారు. అవి మామూలు మాటలు కాదు, అమూల్యమైన ఆణిముత్యాల మూటలు. ఒక సందర్భంలో సాయిబాబా ఇలా చెప్పారు. ...

Read More »

ఏసుదాస్ నోట అయ్యప్ప పాట

ayyappa

హరివరాసనం విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకం అరివిమర్ధనం నిత్య నర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణ కీర్తనం భక్తమానసం భరణ లోలుపం నర్తనాలసం అరుణభాసురం భూతనాయకం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప కళమృదుస్మితం సుందరాననం కళభకోమలం గాత్రమోహనం కళభకేసరీ వాజివాహనం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శ్రితజన ప్రియం చిందిత ప్రదం శృతివిభూషణం సాధు జీవనం శృతి మనోహరం గీతలాలసం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ...

Read More »

తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి

సోమవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామునుంచే వైష్ణవాలయాలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ దేవాలయాలు తిరుమల, ఒంటిమిట్ట, సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, మంగళగిరి,తెలంగాణలో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, భద్రాచలం రామాలయం, వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం తదితర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తిరుమలలో శ్రీవారు వైకుంఠ ద్వార దర్శనంలో భక్తులకు కనువిందు చెయనున్నరు. ఒంటిమిట్ట రామాలయంలో ఉత్తరద్వార దర్శనం కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సీతారామలక్ష్మణుల మూలవిరాట్‌కు అర్చకులు ప్రత్యేక పూజలు, ...

Read More »