info@manadailynews.com
Breaking News

సినిమా వార్తలు

‘బిగ్‌ బాస్‌’ షోలో ఎన్టీఆర్‌

ntr big boss

తెలుగులో అత్యంత ప్రజాభిమానం పొందిన ఎంటర్ టైన్మెంట్ ఛానల్ ‘స్టార్ మా’. హిందీలో  సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్‌ బాస్‌’ షో బాగా ప్రాచుర్యం పొందింది. అదే విధంగా తెలుగులో ‘బిగ్‌ బాస్‌’ షోను ప్రసారం చేయడానికి ‘మా’ ఛానెల్‌ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. అయితే ఈ విషయాన్ని మంగళవారం ఎన్టీఆర్‌ అధికారికంగా ప్రకటిస్తూ షోకు సంబంధించిన తొలి పోస్టర్‌ను ట్విటర్‌లో విడుదల చేశారు. కుర్చీలో కూర్చోన్న ఒక్క కన్నుతో చూస్తూ కనిపించారు. ‘మిమల్ని చూడగలను’ ...

Read More »

అనుష్క శర్మకి ఏమైంది?

pari anushka sharma

చూడగానే ఆకట్టుకొనే రూపం.. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసే నటన.. అనుష్క శర్మ సొంతం.. అయితే ఇప్పుడు నీలికళ్ళతో మొఖం అంత మచ్చలతో భయంకరంగా కనిపిస్తుంది. విషయానికొస్తే అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పరి’ చిత్రం కోసం ఈ గెటప్‌ వేసింది. మంగళవారం ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అనుష్క ఫస్ట్‌లుక్‌ను ట్విటర్‌ ద్వారా విడుదల చేసింది. ఈ చిత్రానికి నిర్మాతగా అనుష్క వ్యవహరిస్తోంది. ఎప్పుడూ గ్లామరస్‌గా తెరపై ఆకట్టుకున్న అనుష్క ఉన్నట్టుండి ఇలాంటి గెటప్‌ వేయడంతో ఈ సినిమాపై ...

Read More »

వేటాడే స్పైడర్ గా వచ్చిన మహేష్

spyder first look

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్రిన్స్ మహేష్ బాబు కొత్త సినిమా స్పైడర్ మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు గూఢాచారిగా నటిస్తున్నాడు. డైరెక్టర్ మురుగదాస్, ఎన్వీఆర్ సినిమా అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా కూడా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.మహేష్. ఈ చిత్ర యూనిట్ మహేష్ బాబును జేమ్స్ బాండ్ అవతారంలో రెండు పోస్టర్స్ రిలీజ్ చేసింది. ఒకటి శత్రువును వేటాడే సీన్ కాగా మరొకటి రొమాంటిక్ గా  కనిపించాడు.  స్పైడర్ ఫస్ట్ లుక్ ...

Read More »

ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయంగా ‘జై.. లవ కుశ’

jai laka kusa

జూనియర్ ఎన్టీఆర్‌ నందమూరి తారకరామారావు ఆర్ట్స్‌ బ్యానర్‌పై కల్యాణ్‌రామ్‌ నిర్మాణంలో ఓ కొత్త సినిమా రాబోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ మొదటిసారి త్రిపాత్రాభినయం చేయబోతున్నారు. ఈ సినిమా చిత్రీకరణకు ముహూర్తం కుదిరింది. ఫిబ్రవరి 10న పూజా కార్యక్రమాలు జరుపుకోని,  ఫిబ్రవరి 15 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు తన ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు నందమూరి కల్యాణ్‌రామ్‌. ఈ చిత్రానికి ‘జై.. లవ కుశ..’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. బాబి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Read More »

వర్మ హీరోయిన్ పై వీధి కుక్కల దాడి

parul yadav

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’ సినిమాలో నటించింది నటి పారుల్‌ యాదవ్‌. ముంబాయిలో తన అపార్టుమెంటు సమీపంలో పారుల్‌ పెంపుడు కుక్కను తీసుకొని రోడ్డు పై నడుస్తూ ఉండగా ఆరు వీధి కుక్కలు ఆమె పెంపుడు కుక్కపై దాడి చేశాయి. ఈ సంఘటన సోమవారం సాయంత్రం ముంబయిలో జరిగింది. తన పెంపుడు కుక్కను కాపాడుకోవడానికి ప్రయత్నించిన పారుల్‌ను వీధి కుక్కలు గాయపరిచాయి. ముఖం, మెడ, కాలి భాగాల్లో బాగా గాయాలయ్యాయి. దీంతో ఆమెను కోకిలాబెన్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పారుల్‌ ...

Read More »

హీటెక్కిస్తోన్న ‘ఇప్పటిలో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు’

appatlo

ప్రశాంత్ మహీధర్ లలిత ఇషితా హీరో హీరోయిన్లుగా బేబీ ఆముక్త సమర్పణలో ప్రశ్నార్ద్ తాతా నిర్మాత గా వెంకటేష్.కె దర్శకత్వంలో  యూత్ ఫుల్ రొమాంటిక్ స్పైసి ఎంటర్ టైనర్ ఇప్పటిలో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు ఈ చిత్రం సెన్సార్  కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు రెడీ గా ఉంది. ఈ చిత్రంలో పతాకస్థాయిలో రొమాన్స్ ఉన్న కారణంగా “ఏ” సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమాను దర్శకుడు పూర్తి స్థాయిలో రొమాన్స్ సన్నివేశాలతో నింపినట్టు తెలుస్తుంది. ఈ మూవీ స్టిల్స్ చూస్తేనే శృంగారం పతాక ...

Read More »

ఫిబ్ర‌వ‌రి 3న వస్తోన్న ‘నేను లోక‌ల్’

nenu local

నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్‌గా, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో త్రినాథ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `నేను లోక‌ల్‌`.`యాటిట్యూడ్ ఈస్ ఎవిరీథింగ్‌` అనేది క్యాప్ష‌న్‌. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పాట‌లు ఇటీవ‌ల విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – ‘మా  ‘నేను లోకల్’  సినిమా ఫిబ్ర‌వ‌రి 3న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. మూవీ త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది. ...

Read More »

నవదీప్‌ ‘నటుడు’ సెన్సార్‌ పూర్తి

navdeep

యంగ్‌ హీరో నవదీప్‌, కావ్యా శెట్టి హీరోహీరోయిన్లుగా కొప్పుల రాజేశ్వరీదేవి సమర్పణలో లెజెండ్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎన్‌.ఎస్‌.ఆర్‌.ప్రసాద్‌ దర్శకత్వంలో రమేష్‌బాబు కొప్పుల నిర్మిస్తున్న సస్పెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘నటుడు’. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే మూవీ ఇది!! హీరో నవదీప్‌ మాట్లాడుతూ – ”దర్శకుడు ప్రసాద్‌ నేరేట్‌ చేసిన సబ్జెక్ట్‌ నాకు చాలా థ్రిల్లింగ్‌గా అన్పించడంతో వెంటనే ఈ చిత్రంలో నటించాను. సినిమా చాలా బాగా వచ్చింది. నటుడిగా నన్ను ...

Read More »

విజయయాత్రలో సప్తగిరి ఎక్స్ ప్రెస్

saptagiri

టాలీవుడ్ స్టార్ కమీడియన్ సప్తగిరి హీరో లాంఛింగ్ సినిమా సప్తగిరి ఎక్స్ ప్రెస్ బాక్సాఫీస్ పై కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన ప్రతి చోటా హౌస్ ఫుల్ వసూళ్ల రాబడుతోందని ఈ చిత్ర బృందం తెలిపింది. మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ శ్రీ సాయి సెల్యులాయిడ్ క్రియేషన్స్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి వస్తోన్న ఆదరణ నేపథ్యంలో ఇటీవలే సప్తగిరి ఎక్స్ ప్రెస్ టీమ్ సక్సెస్ టూర్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా మొదట శ్రీకాకుళం ...

Read More »

శాతకర్ణి దండయాత్రకు సమయం ఆసన్నమైనది

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 100వ సినిమాగానే కాక, అఖండ భారతదేశాన్ని పరిపాలించిన ఏకైక  మహారాజు “శాతకర్ణి” జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా యావత్ ప్రపంచంలోని తెలుగు సినిమా అభిమానులందరి దృష్టినీ ఆకర్షించిన చిత్రం “గౌతమిపుత్ర శాతకర్ణి”. “శాతకర్ణి”గా నందమూరి నటసింహం బాలకృష్ణ ఆహార్యం తెలుగువారిని అమితంగా ఆకట్టుకోగా, “గౌతమిపుత్ర శాతకర్ణి” టీజర్, ట్రైలర్ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఇక చిరంతన్ భట్ స్వరపరిచిన బాణీలతే సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తూ.. సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఆశగా ఎదురుచూసేలా చేసింది. ప్రేక్షకుల, ...

Read More »