info@manadailynews.com
Breaking News

దేశంలో తొలిసారి అనంతలో కాలనీలకు కుల ఆధారిత పేర్లు మార్పు

desamlo copy

దేశంలో తొలిసారి అనంతలో కాలనీల కుల పేర్లు మార్పు

  • సామజిక దురాచారంపై కలెక్టర్ గంధం చంద్రుడు పోరు
  • ఇప్పటివరకు జిల్లాలో 480 కాలనీల పేర్లు మార్పు
  • 2020 ఫిబ్రవరి లోనే జీవో జారీ..
  • ఆంధ్రప్రదేశ్ స్పూర్తితో డిసెంబర్ 2020లో ఆర్డర్ జారీచేసిన మహారాష్ట్ర

వందల ఏళ్లుగా కుల వివక్ష మన దేశంలో వేళ్లూనుకుని మహమ్మారిలా విస్తరిస్తూనే ఉంది. ముఖ్యంగా గ్రామాల్లో కులాల పేరుతో వీధులు ఉంటాయి, ఎస్సీ, ఎస్టీలను అంటరానివారుగా గ్రామ శివార్లకే పరిమితమయిపోతున్నారు. దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగినా, కాలం మారిపోతున్నా కూడా గ్రామీణ ప్రాంతాలతో పాటు, కొన్ని పట్టణాల్లోనూ ఈ వివక్ష కొనసాగుతూనే ఉండటం శోచనీయం.
caste 6caste 5
ఈ దురాచారాన్ని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. హరిజన వాడ, గిరిజన వాడ, దళితవాడ లాంటి పేర్లను మార్చాలని జీఓ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆదేశాలను, దేశంలోనే తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో అమలు చేశారు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు. ఆర్థిక అభివృద్ధితోపాటు, సామాజిక వృద్ధి కూడా కీలకంగా భావించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలతో.. 2020 ఫిబ్రవరి లోనే జిల్లా వ్యాప్తంగా హరిజన, గిరజన, దళితవాడలుగా పిలవబడుతున్న 480 కాలనీల పేర్లను మార్చడంలో కీలకపాత్ర పోషించారు. కులాల పేర్లతో ఉన్న బడుల పేర్లను సైతం మార్చి అన్ని కులాలకు చెందిన పిల్లలు కలిసి చదువుకునేలా చర్యలు చేపట్టారు.

caste 1caste 2caste 3caste 4caste 7caste 8

ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, చాకలి వీధి, ఇలా అనేక రకాలుగా ఉన్న ఆయా కాలనీలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలనీ, జగ్జీవన్ రామ్ నగర్, విశ్వరత్న నగర్, విన్సెంట్ కాలనీ ఇలా పేర్లు పెట్టారు. అలాగే జిల్లా ప్రజలకు ఎన్నో ఏళ్లుగా స్వచ్ఛంద సేవలందిస్తోన్న RDT ఫౌండేషన్ స్థాపకుడు డేవిడ్ ఫెర్రర్ పేరును కాలనీలకు పెట్టి అక్కడి ప్రజల మన్ననలను చూరగొన్నారు. మరికొన్ని ప్రాంతాల పేర్లు మార్చేందుకు చర్యలు చేపట్టారు.

caste 9caste 10caste 11

caste 12caste 13caste 14

ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో పాదరక్షలు వదిలేసి వెళ్లడం, చేతులు కట్టుకుని నిలబడటం వంటి దురాచారాన్ని రూపుమాపేందుకు ‘ఆత్మ గౌరవం’ పోస్టర్‌ను విడుదల చేసి ప్రజల్లో అవగాహన కల్పిస్తోన్న కలెక్టర్ గంధం చంద్రుడు, కుల వివక్షతను సైతం రూపుమాపేందుకు కృషి చేస్తూ.. అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వం సైతం అనంతపురం జిల్లా బాటలో కులాల పేర్లతో ఉన్న వాడల పేర్లను మార్చేలా నిర్ణయం తీసుకోవడం ముదావహం.

caste 18caste 15caste 16caste 19social copy