info@manadailynews.com
Breaking News

BSNL 2700 జూనియ‌ర్ ఇంజ‌నీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

BSNL

ప్రభుత్వ రంగ టెలికమ్యూనికేషన్స్ సంస్థ భార‌త్ సంచార్ నిగ‌మ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2700   జూనియ‌ర్ ఇంజ‌నీర్ ఉద్యోగాల భ‌ర్తీకి ఇవాళ నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ లో రాష్ట్రాల వారీగా పోస్టులను కూడా వివరించారు. బీఎస్ఎన్ఎల్ 2700 జూనియ‌ర్ ఇంజ‌నీర్ ఉద్యోగాల భ‌ర్తీకి వ‌చ్చే నెల 10 నుంచి ఆన్ లైన్ లో సైన్స్ , బీటెక్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవ‌చ్చ‌ని బీఎస్ ఎన్ ఎల్ సంస్థ తెలిపింది. దేశ వ్యాప్తంగా ఉన్న బీఎస్ ఎన్ ఎల్ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న జూనియ‌ర్ ఇంజ‌నీర్ పోస్టుల భ‌ర్తీని ఈ నోటిఫికేష‌న్ ద్వారా నింప‌నున్నారు. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి చివ‌రి తేది ఆగ‌స్టు 10. సెప్టెంబ‌ర్ 29న జేఈ పోస్టుల‌కు ఆన్ లైన్ లో ప‌రీక్ష ఉంటుంద‌ని ఈ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. దేశ‌వ్యాప్తంగా ఉన్న 25 బీఎస్ ఎన్ ఎల్ కేంద్రాల్లో ఎగ్జామ్ నిర్వ‌హిస్తామ‌ని తెలిపింది. ఈ పరీక్ష రాయాలంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కిల్ క్రింద తెలంగాణ విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ నాన్ లోకల్ కిందకు వస్తారు.

మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి