info@manadailynews.com
Breaking News

త్వరలో 10000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

telangana constable

తెలంగాణ పోలీసు శాఖలో మరో 10000 మంది కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఫైల్ పై ఆర్థిక శాఖ ఆమోదం తెలపగానే నోటిఫికేషన్ జారీ అయ్యే వీలుంది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు సిబ్బంది పెంచాలని హోం శాఖ చేసిన సూచనలను సర్కారు పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తాజా భర్తీలో హైదరాబాద్, సైబరా బాద్‌కమిషనరేట్లకు ప్రాముఖ్యమివ్వాలని సర్కారు సంకల్పించినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సిబ్బందిపరంగా ఇబ్బందులు పడుతున్న పోలీసు శాఖను బలోపేతం చేసేందుకు సర్కారు పూర్తిస్థాయిలో కసరత్తులు చేబట్టింది. తెలంగాణలో ప్రస్తుతం 60000 మంది పోలీసు సిబ్బంది ఉండగా, ఇందులో 10000 ఖాళీలు న్నాయి. వీరితో పాటు మరో 18000 మంది హోం గార్డులు సేవలందిస్తున్నారు. ఇతర ప్రాంతాల విష యం ఎలావున్నా రోజు రోజుకూ విస్తరిస్తున్న హైద రాబాద్, సైబరాబాద్ ప్రాంతాలలో పోలీసు సిబ్బం దిని మరింత పెంచాల్సిన అవసరంవుందని వారం టున్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం 3000 ఖాళీలున్నాయి. సైబరాబాద్‌లో 500 వరకు ఖాళీలున్నాయి. హైదరాబాద్ వరకు వస్తే ఇప్పు డున్న ఖాళీలను భర్తీ చేయడంతో పాటు మరో 5000 మందిని అదనంగా నియమించాల్సి వుందని పోలీసు ఉన్నతాధికారులే చెబుతున్నారు. సైబరా బాద్‌లో కూడా మరో 5000 మందిని భర్తీ చేయాల్సి ఉందని అంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తరువాత ఎపికి చెందిన ఈ ప్రాంతంలోని బెటాలియ న్లలో పనిచేస్తున్న అనేక మంది సిబ్బంది సొంత రాష్ట్రానికి వెళ్లే అవకాశాలున్నాయని తేలింది. ఈ నేపథ్యంలో మొదటి విడతగా స్పెషల్ పోలీసు విభాగంలో 4065 కానిస్టేబుళ్లను, సాయుధ బల గంలో 2760 కానిస్టేబుళ్లను భర్తీ చేయాలని సర్కా రు నిర్ణయించింది. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో ఖాళీలను వెంటనే భర్తీ చేయడంతో పాటు అదనపు పోస్టులను దశల వారీగా రిక్రూట్ చేయాలని హోం శాఖ సర్కారును కోరింది. జంట కమిషనరేట్లతో పాటు కొత్తగా ఏర్పాటుచేసిన వరం గల్ కమిషనరేట్ నూతనంగా ఏర్పాటు కానున్న మంచిర్యాల, రామగుండం, ఖమ్మం పట్టణ కమిష నరేట్‌లో కూడా తగినంత సిబ్బంది వుండాలంటే తాజాగా మరో పది వేల మంది కానిస్టేబుళ్లను భర్తీ చేయాల్సిన అవసరం వుందని హోం శాఖ సర్కా రుకు సూచించింది.