నది రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయింది. ఈ ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. కలెక్టరేట్ వెనుక రోడ్డులోని కాకినాడ సబ్ డివిజన్ పోలీస్ అధికారి కార్యాలయం ఎదురుగా మధ్యాహ్నం 12.40 గంటలకు సుమారు 35 సంవత్సరాల మహిళ వచ్చింది. ఒక కూల్‌డ్రింక్ సీసాలో తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటి మీద పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు చూస్తుండగానే ఆమె దేహం మంటల్లో కాలిపోయింది. ఒక్కసారిగా మంటలు శరీరం అంతా వ్యాపించడంతో రక్షించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. చనిపోయిన మహిళ ఎవరనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కాకినాడలో నిప్పంటించుకుని మహిళ మృతి
