పసిబిడ్డను చూస్తే ఎవరైనా మురిసిపోతుంటారు. అలాంటిది అతి కిరాతకంగా పసికందు కాలు విరిచేసాడు హాస్పిటల్ వార్డ్బాయ్. ఈ దారుణం ఉత్తరాఖండ్లో జరిగింది. నిండా నెలరోజులు కూడా నిండని పసికందుపై కర్కోటకుడిలా ప్రవర్తించాడు హాస్పిటల్ వార్డ్బాయ్. జనవరి 25న రూర్కీ హాస్పిటల్లో చిన్నారి జన్మించాడు. ఆ చిన్నారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్చారు. పసికందు ఆపకుండా ఏడుస్తుండటంతో అసహనానికి లోనైనా వార్డ్బాయ్ ఎవరూ లేని సమయం చూసి చిన్నారి కాలును విరిచేశాడు. పసికందు నొప్పిని తట్టుకోలేక ఇంతకీ ఏడుపు ఆపకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు డెహ్రాడూన్ ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు ఎక్స్రే తీశారు. ఆ ఎక్స్రే కాలు విరిగిపోయి ఉండటాన్ని గమనించారు. కాలు ఎలా విరిగింది అనే విషయంలో ఆస్పత్రి విచారణ చేపట్టింది. దీంతో వార్డ్బాయ్ కాలు విరిచిన ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు వార్డ్బాయ్ కాలు విరగొట్టే దృశ్యాలను గుర్తించారు. వార్డ్బాయ్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
పసిబిడ్డ కాలు విరిచేసి కర్కోటకుడు
