info@manadailynews.com
Breaking News

ఇకపై ATM నుంచి ఎంతైనా తీసుకోవచ్చు

unlimited-cash-withdraw-in-atm

గత 30 రోజులుగా పెద్దనోట్లు రద్దవడం… కొత్త నోట్లు ప్రవేశపెట్టటడం… బ్యాంకుల్లో డబ్బులేకుండా పోవడం… ATM ల దగ్గర ప్రజలు డబ్బుల కోసం పెద్దసంఖ్యలో బారులు తీరడం… ఇవన్నీ రోజు చూస్తున్న దృశ్యాలే. ఒకవేళ బ్యాంకులకు వెళ్లిన కూడా కొంత డబ్బులు బాత్రమే ఇవ్వడం… ATM లో 2000 కన్నా ఎక్కువ విత్ డ్రా చేసుకో లేకపోవడం. రోజు నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఇక నుంచి అలాంటి తిప్పలు ఉండవు అంటోంది ఆర్థిక శాఖ. కొత్త సంవత్సరం కానుకగా ATM విత్ డ్రా లిమిట్ ఎత్తివేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఇప్పటికే రూ.2000 నోట్లు ప్రజలకు చేరువ అయ్యాయని.. 2 రోజులుగా దేశవ్యాప్తంగా రూ.500 నోట్ల పంపిణీ చేస్తున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది. దీంతో 500 నోట్లు రాకతో కొద్దీ కొద్దిగా చిల్లర సమస్య కూడా తీరుతున్నాయని అంటున్నారు. జనవరి 1 నుంచి ATM విత్ డ్రా లిమిట్ ఎత్తివేయాలనే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. మొత్తానికి న్యూఇయర్ లో అయినా క్యూ బాధలు తప్పుతాయని భావిస్తున్నారు జనం.