info@manadailynews.com
Breaking News

తెలంగాణ‌లో టీడీపీ హ్యాపీ!

telangana-tdp

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు తెలంగాణ టీడీపీ నేత‌ల‌ను సంబ‌రాల్లో మునిగేలా చేశాయి. గ‌త కొన్నాళ్లుగా ఎదురు దెబ్బ‌లు తింటున్న ఆ పార్టీ నేత‌ల‌కు హైకోర్టు ఆదేశాల‌తో కొత్త ఊపిరి వ‌చ్చ‌న‌ట్లైంది. టీఆర్ఎస్ అధికారం చేప‌ట్టిన నాటి నుంచి టీడీపీనే అధికార పార్టీ ల‌క్ష్యంగా చేసుకుంది. ఏపీ పార్టీకి ఇక్క‌డేం ప‌నంటూ నేరుగా కేసీఆరే విమ‌ర్శ‌లు గుప్పించేవారు. అదే విష‌యాన్ని జ‌నంలోకి విస్తృతంగా తీసుకెళ్ల‌డంలో టీఆర్ ఎస్ నేత‌లు స‌ఫ‌ల‌మ‌య్యారు. దానికితోడు ఓటుకు నోటు కేసులో రేవంత్‌ను ప్ర‌భుత్వం అడ్డంగా బుక్ చేయ‌డంతో ఉన్న కాస్త ప‌రువు కూడా పోయి పార్టీ జీరో అయిపోయింది. ఆ కేసు స‌హా ప‌లు అంశాల‌ను చూపించి టీడీపీ ఎమ్మెల్యేల‌ను అధికార‌పార్టీ ఆక‌ర్షించింది. ఇందులో క‌ర‌డుగ‌ట్టిన టీడీపీ నేత‌లు సైతం గులాబీ బాస్‌కు జై కొట్టారు. దాంతో పార్టీ క్యాడ‌ర్ కూడా చిన్న‌భిన్నం అయింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో టీడీపీ నేత‌లలో రెట్టించిన ఆనందం క‌నిపించింది. టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరుతున్న‌ట్లు ఎమ్మెల్యేలు ఇచ్చిన విలీనం లేఖ చెల్ల‌ద‌ని హైకోర్టు స్ప‌ష్టం చేయ‌డంతో టీడీపీ నేత‌ల ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయింది. ఇదే స‌మ‌యంలో అధికార‌ టీఆర్ ఎస్ నేత‌లు దిగ్ర్భాంతికి గుర‌య్యారు. ఫిరాయింపు ఎమ్మ‌ల్యేల అన‌ర్హ‌త పిటిష‌న్ల‌ను స్పీక‌ర్‌తో ప‌క్క‌న‌పెట్టించి కాలం గ‌డుపుతున్న అధికార పార్టీ ఇప్పుడు ఎలా స్పందిస్తుందో మ‌రి.