తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపకశాఖలో 139 మంది హోంగార్డుల నియామకానికి హోంశాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 16 ఫైర్ అవుట్ పోస్టుల్లో ఖాళీగా ఉన్న హోంగార్డుల పోస్టులను భర్తీ చేయాల్సిందిగా అగ్నిమాపకశాఖ డెరైక్టర్ జనరల్ (డీజీ)కి సూచించారు. ప్రస్తుతం వివిధ విభాగాల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న 117 మందిని హోంగార్డులుగా పరిగణిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వయస్సు: 18 – 40
అర్హతలు: 10వ తరగతి/ ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, బీ.ఎస్సీ/బీ.కామ్/తదితరులు