info@manadailynews.com
Breaking News

బాలయ్య 100 సినిమా ‘రైతు’లో ఆ ఇద్దరు కూడా!

balakrishna 100 movie

ఇప్పటిదాకా బాలకృష్ణ 100వ సినిమా దర్సకత్వం ఎవరు చేస్తారు అనే ప్రశ్నలు షికారు చేశాయి.  సింగీతం వంటి సీనియర్ దర్శకుడితోపాటు బోయపాటి వంటి మాస్ డైరెక్టర్ పేరు కూడా తెరపైకొచ్చింది. కానీ.. వీరందరినీ పక్కకు నెట్టి కృష్ణవంశీ ముందుకు వచ్చాడు. రైతాంగ సమస్యల నేపథ్యంలో “రైతు” అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోందట. మే నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో రైతు నాయకుడిగా బాలకృష్ణ నటించనున్నారు. ఇక బాలయ్య 100వ సినిమాతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వినిపించింది. మోక్షజ్ఞ మాటెలా ఉన్నా బాలకృష్ణకు ఆప్తులైన ఓ ఇద్దరు యువహీరోలు మాత్రం ఈ సినిమాలో నటించబోతున్నారట. ఆ ఇద్దరు హీరోలు మరెవరో కాదు.. నందమూరి ఫ్యామిలీకి చెందిన తారకరత్న… చంద్రబాబు సోదరుడి కొడుకైన నారా రోహిత్. తారకరత్న నెగటివ్ రోల్‌లో కన్పించనుండగా.. రోహిత్ అతిథి పాత్రలో అగుపిస్తాడనే ప్రచారం సాగుతోంది. కృష్ణవంశీ ప్రస్తుతం అ సినిమాకి  సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నాడని సమాచారం. నిజానికి సమంత హీరోయిన్‌గా “రుద్రాక్ష” అనే లేడీ ఓరియంటెడ్  మూవీని ప్రారంభించాలనుకున్నాడు కృష్ణవంశీ. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేసేశాడు. ఈ లోపు బాలకృష్ణ 100వ సినిమా చేసే ఛాన్స్ రావడంతో… “రుద్రాక్ష” ప్రాజెక్ట్‌ను వాయిదా వేశాడట. బాలయ్య హీరోగా సినిమా చేయాలని చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న కృష్ణవంశీకి.. ఏకంగా 100వ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం విశేషం.