info@manadailynews.com
Breaking News

అమ్మ ఇకలేరు

amma

మహా నిష్క్రమణ జరిగిపోయింది. పురచ్చి తలైవి తన మహా ప్రస్తానాన్ని ముగించి వెళ్లిపోయింది. ఇదిగో ఆరోగ్యం కుదుట పడింది.. తిరిగి వస్తోంది.. అనుకునే లోపే అందరి కళ్లు గప్పి.. ఇక రాను అంటూ వెళ్లిపోయింది. తన బిడ్డలను దిక్కు తోచని స్థితిలో వదిలేసి తాను మాత్రం వెళ్లిపోయింది. గుండెలు పగిలేలా ఏడ్చినా.. మూడు కోట్ల దేవుళ్లకు మొక్కినా.. నువ్వు రావాలి ‘అమ్మా’ అంటూ పొల్లిగింతలు పెట్టి వేడుకున్నా మృత్యువు బడిలో శాశ్వత నిద్రలోకి జారుకుంది. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి హఠాత్తుగా తన ప్రయాణాన్ని ముగించి కానరాని లోకాలకు చేరువైంది. అమ్మ మృతితో తమిళనాడు విషాధంతో మునిగిపోయింది. ఆమె పరిస్థితి విషమం అన్న వార్తలు చూసే ఓ అభిమాని గుండె ఆగిపోయింది. అపోలో ఆస్పత్రికి దారిచూపే రహదారులన్నీ ఆమ్మ సేనతో నిండిపోయాయి. అపోలో ఆస్పత్రి ఆవరణం మహా సముద్రాన్ని తలపించేలా మారింది. రెండు నెలలుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న అమ్మ కోలుకుంటుంది అనుకున్నా అది సాధ్యపడలేదు. ఆదివారం కార్డియాక్ అరెస్ట్ తో అమ్మ పరిస్థితి విషమించిందని అపోలో వైద్యులు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆందోళనతో పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అపోలో వైద్యుల‌తో పాటు ఎయిమ్స్ వైద్యులు కూడా ఆమెకు చికిత్స అందిస్తున్నార‌ని ప్ర‌క‌ట‌న చేశారు. లండ‌న్ వైద్య నిపుణుడు రిచ‌ర్డ్ బేలె కూడా జయ ప‌రిస్థితిని చాలా విష‌మంగా ఉంద‌ని.. మిగ‌తా వైద్యుల‌తో క‌లిసి తాను కూడా స‌మీక్షిస్తున్న‌ట్లు చెప్పారు. అధునాత‌న వైద్య ప‌రిక‌రాల సాయంతో ఆమెకు చికిత్స అందుతోంద‌ని. ఇక తమ చేతుల్లో ఏమీ లేదని తేల్చేశారు. అభిమానుల ప్రార్థనలే ఆమెను కాపాడాలని అన్నారు. అయితే ఆ ప్రార్థనలు కూడా అమ్మ మృత్యువును ఆపలేకపోయాయి. అమె మృతితో అభిమానులు, కార్యకర్తల గుండెలు పగిలిపోతున్నాయి.