పూరి జగన్నాథ్-ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ‘టెంపర్’కు ఇప్పుడు సీక్వెల్ రూపొందనుందని పిల్మ్ నగర్లో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే టెంపర్ సీక్వెల్లో హీరో ఎన్టీఆర్ కాదట. ఆ ప్లేస్‌లో మహేష్ నటించనున్నాడని టాక్. ‘టెంపర్ 2’ పేరుతో తెరకెక్కబోయే ఈ చిత్రానికి పూరి జగన్నాథే దర్శకత్వం వహిస్తాడని సమాచారం. టెంపర్‌లో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ వున్న పోలీస్ క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు ‘టెంపర్-2’లోనూ మహేష్ అంతకన్నా ఎక్కువ టెంపోతో చేస్తాడట. అయితే అన్నీ ఓకె గానీ మరి మహేష్ ఈ సినిమాకు ఒప్పుకుంటాడా? ఓ హీరో చేసిన సినిమా సీక్వెల్‌కి మరో టాప్ హీరో సైన్ చేస్తాడా అన్నదే సందేహం.
మహేష్ కోసం టెంపర్-2 రెడీ చేస్తోన్న పూరీ!
