లక్ష్య ఛేదనలో రాణించిన సన్‌రైజర్స్
ఆదివారం బెంగళూరుతో ఫైనల్ మ్యాచ్
ఐపీఎల్-9లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చిరస్మరణీయమైన విజయంతో ఫైనల్ చేరింది. ఫిరోజ్ షా కోట్ల వేదికగా గుజరాత్ లయన్స్‌తో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో 163 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్.. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (58 బంతుల్లో 93 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్-9లో ఫైనల్‌కు చేరింది. శుక్రవారం జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకోగా… గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 162 పరుగులు చేసింది. ఫించ్ (32 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), మెకల్లమ్ (29 బంతుల్లో 32; 5 ఫోర్లు), దినేశ్ కార్తీక్ (19 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులు చేసి నెగ్గింది. బిపుల్ శర్మ (11 బంతుల్లో 27 నాటౌట్; 3 సిక్సర్లు) ఆఖర్లో షో చూపెట్టాడు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ జట్టులో విధ్వంసక ఓపెనర్ మెక్‌కలమ్ (32: 29 బంతుల్లో 5×4) నిలకడగా ఆడినా.. ద్వివేది (5) ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఔటయ్యాడు. అనంతరం వచ్చిన కెప్టెన్ సురేశ్ రైనా (1) కూడా బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటవడంతో గుజరాత్ 19/2తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ (26: 19 బంతుల్లో 4×4, 1×6)తో కలిసిమెక్కలమ్ వరుస బౌండరీలు బాదేశాడు. ఈ జోడి మూడో వికెట్‌కి 5.3 ఓవర్లలోనే 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రమాదకరంగా మారిన ఈ భాగస్వామ్యాన్ని బౌల్ట్ మెరుపు ఫీల్డింగ్ చేసి కార్తీక్‌ను రనౌట్ చేయడం ద్వారా విడదీశాడు. ఈ దశలో మెక్‌కలమ్‌తో జతకలిసిన అరోన్ ఫించ్ (50: 32 బంతుల్లో 7×4, 2×6) తనదైన శైలిలో చెలరేగి అర్ధశతకం సాధించాడు. మధ్యలో మెక్‌కలమ్, డ్వేన్ స్మిత్ (1) రెండు పరుగుల వ్యవధిలో వెనుదిరిగినా.. ఫించ్ ఏ దశలోనూ జోరు తగ్గించలేదు. కానీ.. గుజరాత్ స్కోరు 134 వద్ద బెన్ కటింగ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ఫించ్ క్లీన్ బౌల్డయ్యాడు. చివర్లో రవీంద్ర జడేజా (19 నాటౌట్: 15 బంతుల్లో 1×4) ఫర్వాలేదనిపించినా.. డ్వేన్ బ్రావో (20: 10 బంతుల్లో 4×4) వరుస బౌండరీలు బాదడంతో గుజరాత్ 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్, బెన్ కటింగ్ చెరో రెండు వికెట్లు తీయగా.. బౌల్ట్, బిపుల్ శర్మ తలో వికెట్ తీశారు.
స్కోరు వివరాలు
గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: ద్వివేది (సి) బౌల్ట్ (బి) భువనేశ్వర్ 5; మెకల్లమ్ (సి) భువనేశ్వర్ (బి) బిపుల్ శర్మ 32; రైనా ఎల్బీడబ్ల్యు (బి) బౌల్ట్ 1; కార్తీక్ రనౌట్ 26; ఫించ్ (బి) కటింగ్ 50; స్మిత్ (సి) ధావన్ (బి) కటింగ్ 1; జడేజా నాటౌట్ 19; బ్రేవో (బి) భువనేశ్వర్ 20; ధవల్ కులకర్ణి నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 162.
వికెట్ల పతనం: 1-7; 2-19; 3-63; 4-81; 5-83; 6-134; 7-158.
బౌలింగ్: భువనేశ్వర్ 4-0-27-2; బౌల్ట్ 4-0-39-1; బరీందర్ 3-0-28-0; బిపుల్ శర్మ 3-0-21-1; కటింగ్ 3-0-20-2; హెన్రిక్స్ 3-0-27-0.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ నాటౌట్ 93; ధావన్ రనౌట్ 0; హెన్రిక్స్ (సి) ద్వివేది (బి) స్మిత్ 11; యువరాజ్ (సి) స్మిత్ (బి) కౌశిక్ 8; దీపక్ హుడా ఎల్బీడబ్ల్యు (బి) బ్రేవో 4; కటింగ్ (సి) కార్తీక్ (బి) కౌశిక్ 8; నమన్ ఓజా (సి) జడేజా (బి) బ్రేవో 10; బిపుల్ శర్మ నాటౌట్ 27; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: (19.2 ఓవర్లలో 6 వికెట్లకు) 163.
వికెట్ల పతనం: 1-6; 2-33; 3-61; 4-75; 5-84; 6-117.
బౌలింగ్: ప్రవీణ్ 3.2-0-32-0; ధవల్ కులకర్ణి 4-0-32-0; స్మిత్ 2-0-29-1; రైనా 2-0-15-0; కౌశిక్ 4-0-22-2; బ్రేవో 4-0-32-2.