ఐపీఎల్ ఛాంప్ సన్‌రైజర్స్
అదరగొట్టిన వార్నర్
కటింగ్ ఆల్‌రౌండ్ మెరుపులు
గేల్ చెలరేగినా బెంగళూరుకు భంగపాటు
అందరూ ఉహించినట్లే మెరుపులు మెరిసాయి ఆకాసంలో కాదండీ. క్రికెట్ మైదానంలో. సన్‌రైజర్స్ హైదరాబాద్ – బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య జరిగిన హోరాహోరి పోరాటంలో సన్‌రైజర్స్ గెలిచింది. తొలుత టాస్ గెలిచి బాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ దూకుడుమీద ఆడుతూ 208 రన్స్ చేసింది. ప్రతికూల పరిస్థితుల్లో గొప్పగా పోరాడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్-9 విజేతగా నిలిచింది. హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ (69; 38 బంతుల్లో 8×4, 3×6) పరుగులతో వీర విహారం చేశాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బెన్ కటింగ్ (39 నాటౌట్; 15 బంతుల్లో 3×4, 4×6; 2/35), యువరాజ్ సింగ్ (38; 23 బంతుల్లో 4×4, 2×6) మెరవడంతో మొదట సన్‌రైజర్స్ 7 వికెట్లకు 208 పరుగులు సాధించింది. భువనేశ్వర్ (0/25), ముస్తాఫిజుర్ (1/37), కటింగ్ (2/35) రాణించడంతో ఛేదనలో బెంగళూరును 200 (7 వికెట్లకు) కట్టడి చేసింది. గేల్ (76; 38 బంతుల్లో 4×4, 8×6), కోహ్లి (54; 35 బంతుల్లో 5×4, 2×6) మెరుపులతో ఛేదనలో 10.2 ఓవర్లలో 114/0తో నిలవడంతో బెంగళూరు గెలుపు ఖాయమనుకున్నారంతా. కానీ సన్‌రైజర్స్ బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో ఆ జట్టును కట్టడి చేశారు. తరువాత బాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ గేల్ 76 పరుగులతో సునామి స్రుష్టించాడు. కోహ్లి 54 పరుగులతో దూకుడు ప్రదర్శించాడు. అంత బెంగళూరు విజయం ఖాయమనుకున్నారు. కాని సన్‌రైజర్స్ ఉత్తమ బౌలింగ్ ప్రదర్శనతో బెంగళూరు చేతులెత్తేసింది.
హైదరాబాద్‌కు రెండో కప్పు
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త ఛాంపియన్‌గా అవతరించింది. ఐతే హైదరాబాద్ ఫ్రాంఛైజీకి ఇది రెండో కప్పు. 2009లో గిల్‌క్రిస్ట్ సారథ్యంలో డెక్కన్ ఛార్జర్స్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ ఫ్రాంఛైజీ రద్దు కావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఐపీఎల్లో అవకాశం దక్కింది. 2009లో కూడా హైదరాబాద్ జట్టు.. బెంగళూరుపైనే గెలవడం విశేషం. రెండుసార్లు ఆస్ట్రేలియా ఆటగాళ్ల సారథ్యంలోనే హైదరాబాద్ జట్టు కప్పు సొంతం చేసుకుంది.
వార్నర్ వీరంగం:
హైదరాబాద్‌కు ఓపెనర్లు వార్నర్, శిఖర్ ధవన్ (28) మెరుపు ఆరంభాన్నిచ్చారు. అరవింద్ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతిని బౌండ్రీకి తరలించిన వార్నర్ ప్రత్యర్థికి హెచ్చరికలు పంపాడు. అరవింద్ వేసిన ఆ తర్వాతి ఓవర్లోనూ డేవిడ్ రెండు ఫోర్లు రాబట్టాడు. ఇక వాట్సన్ బౌలింగ్‌లో వార్నర్ సిక్స్, ఫోర్‌తో అలరించగా ధవన్ కూడా భారీ సిక్సర్ సాధించాడు. గేల్ ఓవర్లోనూ వార్నర్ సిక్స్, ధవన్ ఫోర్ రాబట్టారు. దీంతో పవర్‌ప్లే ముగిసే సమయానికి రైజర్స్ 59/0తో జోరుమీదుంది. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని చాహల్ విడగొట్టాడు. చాహల్ బౌలింగ్‌లో స్వీప్‌షాట్‌కు ప్రయత్నించిన ధవన్.. జోర్డాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో వచ్చిన హెన్రిక్స్ అండగా వార్నర్ జోరు కొనసాగించాడు. ఈ క్రమంలోనే అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. జోర్డాన్ వేసిన పదో ఓవర్లోనూ 4, 4తో అలరించాడు. అయితే ఈ ఓవర్లోనే హెన్రిక్స్ (4) అవుటయ్యాడు. వార్నర్‌కు యువరాజ్ జతకలిసిన తర్వాత స్కోరుబోర్డు మరింత వేగం పుంజుకుంది. వాట్సన్ బౌలింగ్‌లో బౌండ్రీ రాబట్టిన యువీ.. ఆ తర్వాత జోర్డాన్ ఓవర్లోనూ 4, 6తో జోరు ప్రదర్శించాడు. కాగా.. వార్నర్‌ను అరవింద్ అవుట్ చేశాడు. వార్నర్ అవుటైనా యువీ దూకుడు ప్రదర్శించాడు. చాహల్ వేసిన 15వ ఓవర్లో 6, 4 సాధించాడు. ఆ తర్వాత అరవింద్ బౌలింగ్‌లోనూ ఫోర్ కొట్టాడు. కానీ.. ఈ ఓవర్లోనే దీపక్ హుడా (3) అవుటయ్యాడు. హాఫ్ సెంచరీకి చేరువైన యువీ కూడా జోర్డాన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరుకున్నాడు.
కటింగ్ కోతలు:
హైదరాబాద్ స్కోరు 16.1 ఓవర్లలో 148/5. ఈ దశలో రైజర్స్ మరో 20-30 పరుగులు చేస్తుందని అంతా భావించారు. కానీ.. బెన్ కటింగ్ ఇన్నింగ్స్ స్వరూపాన్నే మార్చేశాడు. వాట్సన్ వేసిన 18వ ఓవర్లో కటింగ్ 6, 4 రాబట్టాడు. వాట్సన్ వేసిన ఆఖరి ఓవర్లో కటింగ్ ఫోర్, మూడు సిక్సర్లతో చెలరేగి జట్టు స్కోరు 200 దాటించాడు.
ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇది మూడో ఓటమి. 2009, 2011లో కూడా ఆ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఐతే ఎక్కువసార్లు రన్నరప్‌గా నిలిచిన రికార్డు చెన్నై సూపర్ కింగ్స్‌దే. రెండుసార్లు విజేతగా నిలిచిన చెన్నై నాలుగుసార్లు ఫైనల్లో ఓడిపోయింది.
సన్‌రైజర్స్ ఇన్నింగ్స్:
వార్నర్ (సి) ఇక్బాల్ అబ్దుల్లా (బి) అరవింద్ 69; ధావన్ (సి) జోర్డాన్ (బి) చాహల్ 28; హెన్రిక్స్ (సి) చాహల్ (బి) జోర్డాన్ 4; యువరాజ్ (సి) వాట్సన్ (బి) జోర్డాన్ 38; హుడా (సి) కోహ్లి (బి) అరవింద్ 3; కటింగ్ నాటౌట్ 39; నమన్ ఓజా రనౌట్ 7; బిపుల్ శర్మ (సి) చాహల్ (బి) జోర్డాన్ 5; భువనేశ్వర్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 14 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 208;
వికెట్ల పతనం: 1-63, 2-97, 3-125, 4-147, 5-148, 6-158, 7-174; బౌలింగ్: అరవింద్ 4-0-30-2; గేల్ 3-0-24-0; వాట్సన్ 4-0-61-0; చాహల్ 4-0-35-1; ఇక్బాల్ అబ్దుల్లా 1-0-10-0; జోర్డాన్ 4-0-45-3
బెంగళూరు ఇన్నింగ్స్:
గేల్ (సి) బిపుల్‌శర్మ (బి) కటింగ్ 76; కోహ్లి (బి) శరణ్ 54; డివిలియర్స్ (సి) హెన్రిక్స్ (బి) బిపుల్‌శర్మ 5; కేఎల్ రాహుల్ (బి) కటింగ్ 11; వాట్సన్ (సి) హెన్రిక్స్ (బి) ముస్తాఫిజుర్ 11; సచిన్ బేబి నాటౌట్ 18; బిన్నీ రనౌట్ 9; జోర్డాన్ రనౌట్ 3; ఇక్బాల్ అబ్దుల్లా నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 9
మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 200;
వికెట్ల పతనం: 1-114, 2-140, 3-148, 4-160, 5-164, 6-180, 7-194; బౌలింగ్: భువనేశ్వర్ 4-0-25-0; శరణ్ 3-0-41-1; కటింగ్ 4-0-35-2; ముస్తాఫిజుర్ 4-0-37-1; హెన్రిక్స్ 3-0-40-0; బిపుల్ 2-0-17-1
ప్రైజ్‌మనీ: విజేతకు రూ.15 కోట్లు
రన్నరప్‌కు రూ.10 కోట్లు
ఫెయిర్‌ప్లే అవార్డు – సన్‌రైజర్స్
వర్థమాన ఆటగాడు – ముస్తాఫిజుర్
ఉత్తమ ఫీల్డర్ – డివిలియర్స్ (19 క్యాచ్‌లు)
ఉత్తమ క్యాచ్ – రైనా
విలువైన ఆటగాడు – కోహ్లి
అత్యధిక సిక్సర్లు – కోహ్లి (38)
