రియో ఒలింపిక్స్‌లో వరుస పథకాలతో రికార్డులు సృష్టించిన ఉసేన్ బోల్ట్ తన పుట్టిన రోజును ఎవరు ఊహించని విధంగా జరుపుకున్నాడు. ఆదివారం జరిగిన తన 30వ పుట్టిన రోజును బాగా ఎంజాయ్ చేశాడు. బోల్ట్ అమ్మాయిల విషయంలో చాలా వేగాన్ని ప్రదర్శిస్తున్నాడు. బ్రెజిల్ అమ్మాయి, స్టూడెంట్ జాడీ డ్యురేటు(20)తో రాత్రి తన రూంకి రప్పించుకున్నాడు. బోల్ట్‌తో దిగిన ఫోటోలను డ్యురేటు వాట్సాప్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో మార్మోగి పోతున్నాయి. ఈ విషయంపై బోల్టో సోదరి.. జైమకాకు చెందిన గాళ్‌ఫ్రెండ్ కాసి బెనెట్‌తో రెండేళ్లుగా బోల్ట్ డేటింగ్ చేస్తున్నాడని, త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారని తెలిపింది. అయితే ఈ విషయాన్ని బోల్ట్ లైట్‌గా తీసుకున్నాడు. బోల్డ్‌తో రాసలీలలు సాగించిన డ్యురేటు బోల్డ్ ఎవరో తనకు తెలియదని తెలిపింది. ఫోటోలను వాట్సాప్‌లో షేర్ చేశానని, ఫోటోలు వైరల్ కావడంతో తనకు చాలా సిగ్గుగా ఉందని డ్యురేట్ తెలిపింది.