గొల్లప్రోలు రూరల్(తూర్పు గోదావరి జిల్లా) తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఇంజనీరింగ్ కళాశాల భవనంపై నుంచి దూకిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి మరణించాడనే బెంగతో చేబ్రోలులోని ఓ ఇంజనీరింగ్ కళాశాల మేడపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం చామవరం గ్రామానికి చెందిన యవతి కళాశాలలో ఈసీఈ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి 8 సంవత్సరాలు అయినా తండ్రి ప్రేమను మరువలేక పోయింది. అప్పటి నుంచి మనో వేదనకు గురవుతోంది. దీంతో బుధవారం ఈ ఘటనకు పాల్పడింది. కళాశాల సిబ్బంది, తోటి విద్యార్థులు స్పందించి ఆమెను కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.