సింగరేణిలో మరో 242 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఆ సంస్థ సీండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటి వరకు దాదాపు 5వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. తాజా ఉద్యోగాల ఎక్స్టెర్నెల్ నోటిఫికేషన్ను వారం రోజుల్లో విడుదల చేస్తామన్నారు. రాతపరీక్ష ద్వారానే అభ్యర్ధుల ఎంపిక ఉంటుందని, ఇంటర్వ్యూ ప్రక్రియ ఉండబోదని స్పష్టం చేశారు. పరీక్ష రాసిన రోజే ఫలితాల్ని కూడా ప్రకటిస్తామన్నారు.
వివిధ విభాగాలలో ఉద్యోగాలు
జూనియర్ మైనింగ్ ఇంజనీర్ (మైనింగ్) పోస్టులు: 163
వెల్డర్ ట్రైనీ పోస్టులు: 46
మేనేజ్మెంట్ ట్రైనీ ఫైనాన్స్ అండ్ అక్కౌంట్స్ పోస్టులు: 10
ఫార్మసిస్టులు పోస్టులు: 7
జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ పోస్టులు: 4
జూనియర్ టెక్నీషియన్ (ఎక్స్రే)పోస్టులు : 4
జూనియర్ ఫారెస్ట్ అసిస్టెంట్ పోస్టులు: 4
సింగరేణిలో 242 ఉద్యోగాలకు నోటిఫికేషన్
