info@manadailynews.com
Breaking News

అమ్మ సమాధి నుండి వింత శబ్దాలు!

jayalalitha-grave

తమిళ నాడు ధివంగత ముఖ్యమంత్రి జ‌య‌ల‌లిత పార్థీవ స‌మాధి నుంచి వింత శబ్దాలు వస్తున్నాయన్న వార్త సంచలనం రేపుతోంది. ఆమె స‌మాధి వద్దకు వెళ్లి మొక్కే సమయంలో సమాధి నుండి టిక్ టిక్ మంటూ శబ్ధం వస్తోందని ఆమె అభిమానులు చెబుతుండటంతో తండోపతండాలుగా జనం ఆ శబ్దాన్ని వినేందుకు పరుగులు పెడుతున్నారు. గ‌తంలో ఎంజీఆర్ చ‌నిపోయిన‌ప్పుడు కూడా ఆయన సమాధి నుండి ఇలాంటి శబ్దాలే వచ్చినట్లు పుకార్లు రేగాయి. ఆయ‌న‌ మృత దేహంతో పాటు ఆయనకు ఇష్టమైన వాచీని కూడా పూడ్చేశారు. దాంతో సమాధి నుండి కొద్ది రోజుల పాటు టిక్ టిక్ అని శబ్దం వచ్చిందని ప్రచారం జరిగింది. ఇప్పుడు జయ సమాధి నుండి కూడా అలాంటి శబ్దాలే వస్తూన్నాయని ఆమె అభిమానులు చెబుతుండటంతో మెరీనా బీచ్‌లోని ఆమె సమాధిని చూసేందుకు జనాలు క్యూ కడుతున్నారు.