బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్‌ఖాన్‌కు అమెరికాలో వరుసగా మూడో సారి పరాభవం ఎదురైంది. శుక్రవారం లాస్ఏంజెలిస్ విమానాశ్రయంలో అధికారులు ఆయన్ని కొద్దిసేపు నిలిపి ప్రశ్నించారు. దీంతో షారుక్ ఖాన్ ఆగ్రహం వ్యక్తంచేశాడు. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్నా పరిస్థితులనుబట్టి తనిఖీని పూర్తిగా అర్థం చేసుకొని గౌరవిస్తాను. కానీ, అమెరికాలో ఇలా పదేపదే నాకు ఈ పరిస్థితి ఎదురవడం చాలా బాధగా ఉంది’’ అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. అధికారులు నిలిపివేసిన సమయంలో కొన్ని మాంచి పోకెమాన్లను కొట్టగలిగాను అని అన్నాడు. ఈ విషయంపై అమెరికా విదేశాంగశాఖ సహాయమంత్రి నిషా బిస్వాల్ ఖాన్ కు క్షమాపణ చెప్పారు. అమెరికాలో అక్కడి దౌత్యవేత్తలకైనా ఎయిర్‌పోర్టుల్లో ఇలా చేస్తారని ఆమె అన్నారు. భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ కూడా షారుక్‌కు సారీ చెప్పారు. ఇలాంటిది మళ్లీ జరగకుండా చూస్తామన్నారు. దీనిపై షారుక్ స్పందిస్తూ.. ‘‘ఇబ్బందేమీ లేదు సర్.. ప్రొటోకాల్‌ను గౌరవిస్తాను. దానికన్నా అధికమని భావించను. కాకపోతే ఇదో చిన్నపాటి అసౌకర్యం. మీ సహృదయతకు కృతజ్ఞతలు’’ అని ట్వీట్‌చేశారు.
అమెరికాలో షారూఖ్ ‘ఖాన్’ నిర్భందం
