info@manadailynews.com
Breaking News

అమరావతిలో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ ఆడియో?

sardar

సంచలనమే. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రాన్ని ఏప్రిల్ 8 విడుదల చేయాలని చిత్ర యూనిట్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తోంది. ఈ చిత్రం ఆడియో వేడుకను మార్చి 12 లేదా 20న నిర్వహించాలని చూస్తున్నారు. ఆడియో పంక్షన్‌ను హైదరాబాద్ లేదా అమరావతిలో భారీగా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ పవన్‌కళ్యాణ్ మాత్రం అమరావతిలోనే ఆడియో వేడుకను నిర్వహిస్తే బాగుంటుందని అనుకుంటున్నాడట. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ ఆడియో వేడుక ఎక్కడ జరుగుతుందన్న విషయం ఈ వారంలో తెలిసే అవకాశముంది. పవన్‌కు జోడీగా అందాలతార కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను మార్చి 25 వరకు పూర్తి చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. గతంలో బాలకృష్ణ తన ‘డిక్టేటర్’ ఆడియో వేడుకను అమరావతిలోనే నిర్వహించిన విషయం తెలిసిందే.

Sardar Gabbar Singh Kajal Agarwal