info@manadailynews.com
Breaking News

ఎయిర్‌టెల్ అంతు చూస్తున్న జియో!

relliance jio vs airtel

రిల‌య‌న్స్ జియో స‌రికొత్త వ‌రాల మూట‌ను ప్ర‌క‌టించింది. ముంబైలో జ‌రిగిన ఆ కంపెనీ వార్షిక స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో వినియోగ‌దారుల‌కు అందించ‌నున్న భారీ ఆఫ‌ర్ల‌ను వెలువ‌రించింది. త‌మ స్టోర్‌కు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని వ‌స్తే చాలు సిమ్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఆ సిమ్ ద్వారా ఏ నెట్‌వ‌ర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాల్స్‌, అన్‌లిమిటెడ్ 4జీ నెట్ అంద‌జేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. విద్యార్థుల‌కు ఐడీ చూపిస్తే మ‌రింత అద‌న‌పు డేటాను ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. దేశంలో 2017 నాటికి  90శాతం గ్రామాలకు తమ సేవలు అందుబాటులో ఉంచే లక్ష్యం పెట్టుకున్నాన‌మ ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ ప్ర‌క‌టించారు. పండుగ రోజుల్లో ప్ర‌త్యేక టారీఫ్‌లు పెట్టే దుస్సంప్ర‌దాయ‌నికి చెక్ పెడ‌తామ‌ని ఇక‌పై ఏ రోజైనా త‌మ సేవ‌ల ద‌ర‌లు ఒకేలా ఉంటాయ‌ని చెప్పారు. 5 పైసలకే  ఒక  ఎంబీ, రూ.50కే జీబీ డేటా సేవలను అందించనున్నామ‌న్నారు. ముకేశ్ ఇలా వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకోవ‌డమే ల‌క్ష్యంగా చేసిన ప్ర‌క‌ట‌న మిగిలిన టెలికం సంస్థ‌ల‌కు ముచ్చెమ‌ట‌లు పోయిస్తోంది. ముకేశ్ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన వెంట‌నే ఎయిర్‌టెల్‌, ఐడియా వంటి సంస్థ‌ల షేర్ల‌న్నీ ప‌త‌నం అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎయిర్‌టెల్‌, ఐడియా, వొడాఫోన్ త‌దిత‌ర సంస్థ‌ల‌న్నీ భార‌తీయ మొబైల్ వినియోగ‌దారుల‌ను త‌న క‌బంద‌హ‌స్తాల్లో బంధించాయి. వీరు చెప్పిందే టారీఫ్. ఇచ్చిందే నెట్‌వ‌ర్క్. కాల్ డ్రాప్ అయినా… నెట్ కానెక్ట్ కాకున్నా… నో రెస్పాన్స్‌. పైగా ఇష్ట‌మొచ్చిన ధ‌ర వ‌సూలు. ఈ దోపిడీకి ఇప్పుడు రిల‌యెన్స్ జియో అడ్డుక‌ట్ట వేస్తోంది. దేశంలో మొబైల్ సేవ‌లందిస్తున్న సంస్థ‌ల‌న్నీ ఒక‌వైపు. రిల‌యెన్స్ జియో ఒక‌పైవు అన్న‌ట్లుగా ఇప్పుడు యుద్ధం మొద‌లైంది. జియో త‌న సంచ‌ల‌న ఆఫ‌ర్ల‌తో ఆక‌ట్టుకునేందుకు ముందుకు రావ‌డంతో ఈ సంస్థ‌ల‌న్నీ గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ చేస్తున్న దోపిడీకి ఎక్క‌డ భంగం క‌లుగుతుందో అని భ‌య‌ప‌డిపోతున్నాయి. బాధ‌ప‌డిపోతున్నాయి. దేశంలోని మొబైల్ వినియోగిస్తున్న వారిలో 90 శాతం మందిని ఆక‌ర్షించ‌డ‌మే త‌మ ల‌క్ష్యం అని ముకేశ్ చేసిన ప్ర‌క‌ట‌న‌తో ఈ గుత్తాధిప‌త్య సంస్థ‌లు వ‌ణికిపోతున్నాయి.