భారతీయ వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ ఫోర్త్ జనరేషన్ తెలివి తేటలతో భారీ దోపీడీకి తెర తీశారు. పైసా లాభం లేకుండా ఏ పని చేయని ఒక వ్యాపారవేత్త ఇలా అత్యంత ఖరీదైన నెట్వర్క్ సేవలను ఉచితంగా అంజేస్తున్నారంటే అనుమానించాల్సిందే. అలా అనుమానిస్తే ఆయన ప్రవేశపెట్టిన ఉచిత పథకం వెనకున్న 4జీ దోపీడి వెలుగులోకి వచ్చింది. ప్రత్యర్థి కంపెనీలను దెబ్బకొట్టి వాటి వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖేశ్ ఈ ఉచితానికి తెర తీశారు. నిజానికి ఇందులో వినియోగదారుల జేబుకు కూడా భారీగా చిల్లు పెట్టే వ్యూహం దాగుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ముందు మూడు నెలలు లాంఛింగ్ ఆఫర్లో మాత్రమే ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత ఒక జీబీ డేటాను రూ.50లు పెట్టి కొనాల్సిందే. అలా కొన్న డేటాను పొదుపుగా వాడుకుంటూ కాల్స్ మాత్రమే మాట్లాడుకుంటామంటే కుదరదు. జియో నుంచి కాల్స్ చేయాలంటే కచ్చితంగా మొబైల్ డేటా ఆన్‌లో ఉండాల్సిందే. దీని ద్వారా వాయిస్ కాల్స్ చేసుకోవాలంటే ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ను వాడాలి. ఆ యాప్ పని చేయాలంటే డేటా ఆన్‌లో ఉండాల్సిందే. అంటే కాల్ మాట్లాడుతున్న ప్రతిసారీ డేటా ఖర్చవుతూనే ఉంటుంది. అంటే కాల్స్ ఫ్రీ బట్ డేటా కాదు… డేటా అయిపోగానే మళ్లీ రీచార్జ్ చేసుకోవాలి. అంటే మిగిలిన ఫోన్లలో కాల్స్ చేసుకునరేందుకు రిచార్జి చేసుకుంటాం. జియోలో మాత్రం డేటా అయిపోగానే రీచార్జి చేసుకుంటాం. కాల్స్‌కు పెట్టే డబ్బులు డేటాకు పెట్టాలన్నమాట. ఇక్కడా ఓ భారీ దోపిడీ ఉంది. 2జీ, 3జీ కంటే 4జీ సేవలు ఎంతో ఖరిదైనవి. అలాగే డేటా వినియోగం కూడా 4జీలో ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 2జీలో 1జీబీ డేటా ఓ వారం వస్తుందనుకుంటే అదే 4జీలో 1 జీబీ డేటా రెండు రోజల్లోనే అయిపోవచ్చు. మనం ఫోన్ కాల్స్ మాట్లాడే దాన్నిబట్టి…. నెట్ వాడేదాన్ని బట్టి అది ఇంకా వేగంగా కూడా ఖాళీ కావచ్చు. అంటే ఇలా డేటా అయిపోయిన ప్రతిసారీ మళ్లీ రీచార్జ్ చేసుకోవాల్సిందే. అలా రీచార్జి చేసుకున్న ప్రతిసారీ రూ.50 పెట్టాల్సిందే. అంటే నెలకు నాలుగుసార్లు రీచార్జి చేసుకుంటే రెండొందలు చేతి చమురు వదిలినట్లే మరి ఉచితం ఎక్కడా? అంటే కాల్ చార్జిలు లేవని చెబుతూనే డాటా చార్జీల రూపంలో బాదేస్తున్నారన్నమాట. ముఖేశ్ మొన్న మాట్లాడుతూ…. ఈ గొప్ప ఐడియా తన కోడుకు కూతుర్లదేనని చెప్పారు. అంటే తండ్రి తన తెలివితేటలతో దేశాన్ని దోచేస్తుంటే ఆయన వారసులు ఇప్పటి నుంచే జనం జేబుకు చిల్లు పెడుతున్నారన్నమాట.
భారీ దోపిడీకే ముఖేశ్ 4జీ కలర్!
