info@manadailynews.com
Breaking News

ప్రజ్ఞాన్ ఓజా తలకు తగిలిన బాల్.. ఆస్పత్రిలో చికిత్స

pragyan ojha

దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా గ్రీన్, ఇండియా బ్లూ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఓ సంఘటన చోటుచేసుకుంది. ఇండియా గ్రీన్ జట్టు బౌలర్ జలజ్ సక్సేనా వేసిన బంతిని ఇండియా బ్లు జట్టు బ్యాట్స్‌మన్ పంకజ్ సింగ్ మిడ్ ఆన్ మీదగా షాట్ బాదాడు అయితే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఓజావైపుకు బంతి ఊహించని మలుపు తిరిగి దూసుకొచ్చింది. ఓజా వెనక్కు తిరగడంతో బంతి మెడ వనక భాగాన్ని బలంగా తాకడంతో అక్కడికక్కడే మైదానంలో పడిపోయాడు. కొద్ది సమయం పాటు కోమాలోకి వెళ్లినట్టు వెళ్ళాడు. భారత బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా తలకు తీవ్రమైన గాయంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇతను చికిత్స పొందుతున్నాడు. ఈ మ్యాచ్ గ్రేటర్ నోయిడాలో జరుగుతుండగా ఓజా ఇండియా గ్రీన్ జట్టు తరుపున ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఈ ఘటనతో సహా ఆటగాళ్లందరూ షాక్‌కు గురయ్యారు.ప్రస్తుతం ఓజా పరిస్థితి బాగానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే ప్రజ్ఞాన్ ఓజా పూర్తిగా కోలుకునే వరకూ వైద్య పర్యవేక్షణలోనే ఉంచనున్నారట.