info@manadailynews.com
Breaking News

చిన్న నోట్ల విలువ పెరిగింది: మోడీ

modi

చిన్న నోట్లకు విలువ బాగా పెరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శనివారం గుజరాత్‌లో పర్యటించిన ఆయన దీసాలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో రైతులనుద్దేశించి ప్రసంగించారు. గత ప్రభుత్వాల హయాంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడేవారని, బీజేపి అధికారంలోకి వచ్చాక రైతుల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నామని అన్నారు.

నల్లధనం నియంత్రణ కోసమే పెద్దనోట్లు రద్దు నిర్ణయం చేశామని మోడీ అన్నారు. దీని వల్ల ఇప్పుడు రూ.10, రూ.20, రూ.50 నోట్లకు విలువ పెరిగిందని, నోట్ల రద్దు అనంతరం చిన్న నోట్ల కోసం ప్రజలు పోటీ పడ్డారని అన్నారు. ఇదే విధంగా ఇప్పుడు చిన్న నోట్లకు విలువ ఎలా పెరిగిందే సామాన్య ప్రజలకు కూడా అలాగే విలువ పెరగాలని తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.