భారత్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే యుద్ధ వాతావరణమే. ఓడిన జట్టు పరిస్థితే అయితే చెప్పక్కర్లేదు. ఆ దేశంలో వారికి తీవ్ర అవమానం తప్పదు. చిరకాల ప్రత్యర్థి భారత చేతిలో పాకిస్థాన్ వరుసగా 11వ ఓటమిని చవిచూసింది. దీన్ని పాకిస్థాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. భారతతో శనివారం జరిగిన మ్యాచ్‌లో అఫ్రీది సేన ఆటతీరుపట్ల మాజీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తే.. ఆగ్రహంతో ఊగిపోయిన అభిమానులు కొందరు రోడ్లపైకొచ్చి టీవీ సెట్లను పగలగొట్టుకున్నారు. కొందరేమో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకి వ్యతిరేకంగా నినాదాలు చేసి కోపాన్ని వెళ్లగక్కారు. దాయాది భారతతో పోరులో జట్టు ప్రణాళిక, ఆటగాళ్ల ప్రదర్శన పట్ల పాకిస్థాన్ మీడియా దుమ్మెత్తిపోసింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన కోచ్ వకార్ యూనిస్, కెప్టెన్ షాహిద్ అఫ్రీదిని బాధ్యులను చేస్తూ వారి తప్పు డు గేమ్ ప్లాన్ వల్లే పాక్ ఓడిందని పతాక శీర్షికల్లో విమర్శల వర్షం కురిపించింది.
మాజీ ఆటగాళ్ళ ఫైర్
భారతతో మ్యాచ్‌లో పాక్ అనుసరించిన వ్యూహాలపట్ల మాజీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుందని తెలిసినా లెగ్ స్పిన్నర్ ఇమాద్ వసీంను తప్పించి మరో పేసర్‌ను తీసుకోవడాన్ని మాజీ టెస్ట్ బ్యాట్స్‌మన్ బాసిత అలీ తప్పుబట్టాడు. అలాగే బ్యాటింగ్ ఆర్డర్లో అఫ్రీది వన్‌డౌన్‌లో రావడాన్ని కూడా బాసిత ప్రశ్నించాడు. మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ కూడా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
పాక్ జట్టు ఈడెన్ పిచ్‌ను సరిగా అర్థం చేసుకోకుండా సరైన ప్రణాళిక లేకుండా బరిలోకి దిగిందని అన్నాడు. ‘నలుగురు పేసర్లతో ఆడాల్సిన పిచ్ కాదని, స్పిన్నర్‌తో బరిలోకి దిగాల్సింది. ప్రపంచక్‌పలో భారతపై గెలిచే అవకాశాన్ని పాక్ చేజార్చుకుందని సక్లయిన్ అభిప్రాయపడ్డాడు.
ఈ మ్యాచ్‌లో పాక్ స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండానే బరిలోకి దిగిందని లారా విమర్శించాడు. ‘అఫ్రీదిని నేనసలు స్పిన్నర్‌గానే కాదు సరైన బ్యాట్స్‌మన్‌గా కూడా పరిగణించను. అఫ్రీదినే కాదు షోయబ్ మాలిక్ కూడా స్పెషలిస్ట్ స్పిన్నర్ కాదు.
భారతతో మ్యాచ్‌కు ముందు పాక్ ఆటగాళ్లతో మాట్లాడేందుకు వచ్చిన ఇమ్రాన్ ఖాన్ తో తన బ్యాటింగ్ ఆర్డర్ గురించి ఫిర్యాదు చేసిన ఉమర్ అక్మల్‌పై మాజీ ఆటగాడు రమీజ్ రాజా ఆగ్రహం వ్యక్తం చేశాడు.
భారతతో కీలక మ్యాచ్‌లో పాక్ జట్టు ఎంపికే సరిగా లేదని మాజీ కెప్టెన్ రమీజ్ రాజా కూడా విమర్శించాడు.
అఫ్రీది కెప్టెన్సీ పోయినట్లే!
భారత చేతిలో ఓటమి అఫ్రీది కెప్టెన్సీకి ఎసరు తెచ్చినట్లే అంటున్నాయి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వర్గాలు. ఈ ప్రపంచకప్ అనంతరం అఫ్రీదిపై వేటు వేసే యోచనలో పీసీబీ ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి వరల్డ్‌కప్ అనంతరం అఫ్రీది ఆటకు గుడ్‌బై చెప్పాలని అనుకుంటున్నాడు.
పాకిస్తాన్ జట్టుకు భద్రత
భారత చేతిలో ఘోర పరాభావం అనంతరం చండీగఢ్ వచ్చిన పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌కు భద్రతను కట్టుదిట్టం చేశారు. మొహాలీ వేదికగా మంగళవారం జరిగే తన తర్వాతి మ్యాచ్‌లో పాక్ జట్టు న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం పాక్ జట్టు ఆదివారం మధ్యాహ్నం ఇక్కడకు చేరుకుంది. అయితే అందుకోసం చండీగఢ్, పంజాబ్ పోలీసులు పాక్ జట్టు భద్రత కోసం అదనపు బలగాలను రంగంలోకి దించారు.