info@manadailynews.com
Breaking News

భారత్ ను హెచ్చరించిన పాక్ చిన్నారి

pakistan-children

ఉరీ ఉగ్రదాడి ఘటనపై భారత్, పాక్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఓ వైపు తమకు యుద్ధం చేసే ఉద్దేశం లేదని ప్రధాని మోదీ పేర్కొన్నా సరే పాక్ మత్రం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ కయ్యానికి కాలు దువ్వుతోంది. పాక్ ప్రజల మనసుల్లో భారత్ పై విషం నింపుతోంది. భారత్ ఓ శతృదేశమని, దాన్ని సర్వనాశనం చేయడమే పాక్ లక్ష్యమని పిల్లలకు నూరిపోస్తోంది. అందుకు తార్కాణంగానే.. ఓ వీడియో హల్చల్ చేస్తోంది. ఐదేళ్లు కూడా లేని ఓ చిన్నారికి తండ్రి ఏకే-47 పట్టుకుని ఎలా పేల్చాలో నేర్పిస్తున్న విడియో అది. అందులో వచ్చీరాని మాటలతోనే ఆ బాలిక భారత్‌ను హెచ్చరిస్తోంది. మోదీ, ఇండియా అన్న మాటలతోపాటు చూపుడు వేలుతో వార్నింగ్ ఇచ్చి గన్‌ పేల్చింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో మీ కోసం..