info@manadailynews.com
Breaking News

రియో మారథాన్లో మంచినీళ్లు కూడా ఇవ్వలేదు

riyo

ఓ వైపు రియో ఒలింపిక్స్ 2016లో సింధు, సాక్షి, దీప విజయాలతో దేశం సంబరాలు జరుపుకుంటోంది. మరో వైపు రియోలోనే ఇంకో దారుణ ఘటన బయటికి వచ్చింది. భారత అథ్లెట్ ఓపీ జైషా మారథాన్‌లో పాల్గొన్నప్పుడు ఆమెకు కనీసం మంచినీరు కూడా అందుబాటులో లేదు. 43 డిగ్రీల ఎండలో మారథాన్‌లో పాల్గొన్న జైషా మంచినీరు అందక విలవిలలాడింది. మారథాన్ ముగిశాక ఆమె మూడు గంటలపాటు స్పృహలో లేకుండా పడిపోయారు. భారత్‌కు స్టేషన్ ఉన్నా అక్కడ మంచినీరు లేదని ఆమె చెప్పారు. తాను బతికి ఎలా బయటపడ్డానో తనకే తెలియడం లేదన్నారు. నిబంధనల ప్రకారం మారథాన్‌‌లో పాల్గొనే రన్నర్లకు ప్రతి రెండు కిలోమీటర్లకు మంచినీళ్ల బాటిల్‌తో పాటు రెఫ్రెష్‌మెంట్ కూడా అందుబాటులో ఉంచాలి. అయితే భారత మహిళల మారథాన్ కోచ్ కానీ ఇతర అధికారులెవ్వరు కానీ అందుబాటులో లేకపోవడంతో జైషా పరిస్థితి దయనీయంగా మారింది. కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్‌ స్పందించారు. ఇలాంటివి మామూలుగానే జరుగుతుంటాయి అని వ్యాఖ్యానించారు.