నయీం గ్యాంగ్ అరాచకాలకు సహకరించిన మాజీ మంత్రి ఎవరన్నది ఇప్పుడు రాష్ట్రంలో సంలచనం సృష్టిస్తున్న అంశం. నయీం ఎన్కౌంటర్ తర్వాత సిట్ చేపట్టిన విచారణలో అనేక సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. నయీం రాసుకున్న డైరీ ఎంతోమంది రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, విలేకర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఈ కేసులో సిట్ అధికారులు ఒక మాజీ మంత్రికి నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. నయీం ఉన్నంతకాలం ఆతడితో కలిసి దందాలు చేసిన సదరు మంత్రి నయీం హతమయ్యాక కొన్ని రోజులుగా సిటీలో కనిపించడం లేదట. ఆ మంత్రి గురించి సిట్‌కు ఉప్పందండంతో మాజీ మంత్రి ఎక్కడున్నారా అని చూస్తే కొన్నాళ్లుగా అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం బయటపడిందట. దాంతో సిట్ పోలీసులు ఆ మంత్రికి నోటీసులు జారీ చేశారు. కాగా, ఇప్పటికే నయీం కేసులో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలున్నా సరే కఠిన చర్యలు తీసుకోవాలంటూ కేసీఆర్ పోలీసులకు స్పష్టం చేయడంతో పలువురు నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి వ్యవహారం బయటకు రావడంతో ఆ నేతతోనే పొలిటికల్ లీడర్స్ పని పట్టడం ప్రారంభించాలని సిట్ అదికారులు భావిస్తున్నారట. త్వరలోనే ఆ మాజీ మంత్రిని విచారించే అవకాశం ఉందన్నది తాజా వార్త.
నయీంకు సహకారం… మాజీ మంత్రికి నోటీసులు?
