info@manadailynews.com
Breaking News

అమ్మ మృతిపై వీడిన మిస్టరీ..!

jayalalitha-death-secret

తమిళనాడు ధివంగత ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మృతి అనంతరం పలు అనుమానాలు రేకెత్తాయి. ఆమె ముందే చనిపోయిందని, స్లో పాయిజన్ ప్రయోగం జరిగిందని ఇలా ఎన్నో అనుమానాలు మొదలయ్యాయి. బంధువులు కూడా ఆమె మృతిపై పలు ఆరోపణలు చేశారు. అయితే అమ్మ మృతిలో అసలు నిజం ఏంటి అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. అమ్మ ట్రీట్‌‌మెంట్ ఆమె పరిస్థితిపై అపోలో ఆస్పత్రి సిబ్బంది ఎవరూ చెప్పలేదు. అయితే అన్ని ప్రశ్నలకు సమాధానంగా.. అపోలో చైర్మ‌న్ సి.ప్ర‌తాప్ రెడ్డి ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంట‌ర్‌వ్యూలో వివ‌రించారు. జయలలిత తమ ఆస్పత్రిలో చేరినప్పటి నుండి మెరుగైన చికిత్స అందించామని ఆయన తెలిపారు. ఒకటి రెండు రోజులు తప్ప మిగిలిన అన్ని రోజులు తానే దగ్గరుండి ట్రీట్ మెంట్ గురించి పర్యవేక్షించినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే ఆమె పూర్తిగా కోలుకున్నార‌ని డిశ్చార్జ్ చేసేందుకు కూడా సిద్ద‌మ‌య్యామని అన్నారు. అయితే డిసెంబ‌ర్ 5న అత్యవసరం ఉండి హైదరాబాద్ వచ్చానని, వెళ్లిన తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేయాలనుకున్నామన్నారు. కానీ అకస్మాత్తుగా డిసెంబ‌ర్ 4న గుండెపోటు రావడంతో పరిస్థితి అంతా మారిపోయిందన్నారు. హార్ట్ ఎటాక్ రావ‌డంతో వెంటనే ఎక్మో యంత్రాన్ని అమ‌ర్చినా అది ఫలితం ఇవ్వలేకపోయిందని, జయ విశయంలోనే ఇలా జరగడం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని అన్నారు. ఆస్పత్రిలో చేరిన నాటి నుండి ఎప్పుడు చూసినా జయలలిత నవ్వుతూనే కనిపించేవారని ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. చికిత్స సమయంలోనూ అన్నిటికీ సహకరించిన ఆమె చివరికి కన్నుమూయడం బాధాకరమని ఆవేదనగా అన్నారు.