info@manadailynews.com
Breaking News

మారుతీ సుజుకీ ముందంజ

maruti suzuki

దేశీయ కార్ల మార్కెట్‌లో మారుతీ సుజుకీ ఆధిపత్యం చూపిస్తోంది. సియామ్ గణాంకాల ప్రకారం.. అత్యధికంగా కొనుగోళ్లు చేసిన దేశీ టాప్-10 ప్యాసెంజర్ వాహనాల్లో మారుతీ సుజుకీ ‘ఆల్టో’ (21,462 యూనిట్ల విక్రయాలు) అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో వరుసగా ఇదే కంపెనీకి చెందిన హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ (14,057 యూనిట్లు), కాంపాక్ట్ సెడాన్ డిజైర్ (14,042 యూనిట్లు), వేగన్ ఆర్ (12,744 యూనిట్లు) మోడళ్లు సహా హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 (9,934 యూనిట్లు), మారుతీ సెలెరియో (7,141 యూనిట్లు), హ్యుందాయ్ క్రెటా (6,589 యూనిట్లు) ఉన్నాయి. జనవరిలోనూ కంపెనీకి చెందిన 6 మోడళ్లు టాప్-10 దేశీ ప్యాసెంజర్ వాహనాల జాబితాలో స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే.