కుటుంబ కలహాలతో బావిలో దూకి బ్రహ్మయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్టూరులో జరిగింది. మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.