info@manadailynews.com
Breaking News

తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య

SI died

సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం కుక్కునూరు పోలీస్‌స్టేషన్‌లో పది నెలల్లో ఇద్దరు ఎస్‌ఐలు ఆత్మహత్య చేసుకోవడం పోలీస్‌శాఖలో చర్చనీయాంశమైంది. బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న ప్రభాకరర్‌రెడ్డి తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్టేషన్ లోనే తన గదిలో కుర్చీపై కూర్చుని తుపాకీతో తలపై కాల్చుకున్నాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ఇది ఇలా ఉండగా ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈయన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరుకు చెందిన ప్రభాకర్‌రెడ్డి 2012లో ఎస్‌ఐగా ఉద్యోగంలో చేరారు. 2016లో కుక్కునూరుపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్‌ఐగా విధుల్లో చేరారు.