info@manadailynews.com
Breaking News

కృష్ణవంశీతో బాలకృష్ణ 100వ సినిమా?

balakrishna krishna vamsi

గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలకృష్ణ వందో చిత్రం పై రక రకాలుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఆదిత్య 369 సీక్వెల్‌గా సింగీత శ్రీనివాసరావు దర్శకత్వంలో తన 100వ చిత్రం ఉంటుందని గతంలో బాలకృష్ణ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సీక్వెల్ విషయంలో బాలకృష్ణ పునరాలోచనలో పడినట్లు తెలిసింది. బాలకృష్ణ కోసం బోయపాటి శ్రీను కూడా ఓ కథను సిద్ధం చేసారంట.  కానీ బోయపాటి సరైనోడు చిత్ర షూటింగ్ తో బిజీగా ఉన్నాడట. ఇప్పుడు కృష్ణవంశీ పేరు తెరపైకి వచ్చింది. కృష్ణవంశీ బాలకృష్ణకు ఓ కథ వినిపించాడని, కథలోని కొత్తదనం నచ్చడంతో ఈ చిత్రానికి బాలకృష్ణ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సినివర్గాల్లో చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ప్రస్తుతం కృష్ణవంశీ ‘రుద్రాక్ష’ పేరుతో మహిళా ఓరియెంటెడ్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్దమయ్యాడు. కానీ అనూహ్యంగా బాలకృష్ణ సినిమా తెరపైకి రావడంతో రుద్రాక్షను వాయిదా వేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ వందో సినిమా విషయమై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలిసింది.