info@manadailynews.com
Breaking News

ఆరుగంట‌ల్లోనే ఖైర‌తాబాద్ గ‌ణ‌ప‌తి నిమ‌జ్జ‌నం

khairatabad-ganesh-immersion

ఇది స‌రికొత్త రికార్డు. 24 నుంచి 36 గంట‌లు ప‌ట్టే ఖైర‌తాబాద్ వినాయ‌క విగ్ర‌హ నిమ‌జ్జ‌నం ఈ సారి ఆరు గంట‌ల్లోనే పూర్త‌య్యింది. దీంతో చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని రికార్డును న‌మోదు చేసింది. 11 రోజుల భ‌క్తుల విశేష పూజ‌లు త‌ర్వాత గ‌ణ‌నాథుడు గురువారం మ‌ధ్యాహ్నానానికి గంగ‌మ్మ ఒడిలో సేద‌తీరాడు. జోరు వాన‌లో సైతం భ‌క్తుల చిందులు, డ‌ప్పుల హోరు…. ఉద‌యాన్నే ఖైర‌తాబాద్ గ‌ణ‌ప‌య్య విగ్ర‌హ ఊరేగింపు ప్రారంభ‌మైంది. ఈ సారి ప్ర‌భుత్వం, ఖైరతాబాద్ ఉత్స‌వ క‌మిటీలు ముంద‌గా చెప్పిన‌ట్లు విగ్ర‌హ త‌ర‌లింపు నుంచి నిమ‌జ్జ‌నం వ‌ర‌కూ షెడ్యూల్ ప్ర‌కార‌మే అన్నీ జ‌రిగిపోయాయి. సాధార‌ణంగా ప్ర‌తిఏటా హైద‌రాబాద్ న‌గ‌రంలో కొలువైన గ‌ణ‌ప‌తుల విగ్ర‌హాల‌న్ని నిమ‌జ్జ‌నం ముగిసిన త‌ర్వాత చివ‌రిగా ఖైర‌తాబాద్ గ‌ణ‌ప‌తిని హుస్సేన్ సాగ‌ర గ‌ర్భంలోకి చేరుస్తారు. ఇందుకు రెండు రోజులు ప‌ట్టిన సంద‌ర్భాలూ ఉన్నాయి. ఈసారి 11వ రోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఖైర‌తాబాద్ గ‌ణ‌ప‌తి నిమ‌జ్జ‌నం పూర్తి చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అన్న‌ట్లుగానే నిమ‌జ్జ‌నం పూర్తి చేసి రికార్డు నెల‌కొల్పింది.  ఇక‌, బాలాపూర్‌లో ప్ర‌ఖ్యాతిగాంచిన ల‌డ్డూ వేలం కూడా రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టింది. గ‌త ఏడాది 10.32 ల‌క్ష‌లు ప‌లికిన ల‌డ్డూ ఈ ఏడాది 14.64 ల‌క్ష‌లు ప‌లికింది. రెండేళ్లుగా ల‌డ్డూ వేలంలో పాల్గొంటున్న స్కైలాబ్ రెడ్డి ఈ సారి ప‌ద్నాలుగున్న‌ర ల‌క్ష‌లు వెచ్చించి ల‌డ్డును సొంతం చేసుకున్నారు.