info@manadailynews.com
Breaking News

వర్మ హీరోయిన్ పై వీధి కుక్కల దాడి

parul yadav

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’ సినిమాలో నటించింది నటి పారుల్‌ యాదవ్‌. ముంబాయిలో తన అపార్టుమెంటు సమీపంలో పారుల్‌ పెంపుడు కుక్కను తీసుకొని రోడ్డు పై నడుస్తూ ఉండగా ఆరు వీధి కుక్కలు ఆమె పెంపుడు కుక్కపై దాడి చేశాయి. ఈ సంఘటన సోమవారం సాయంత్రం ముంబయిలో జరిగింది. తన పెంపుడు కుక్కను కాపాడుకోవడానికి ప్రయత్నించిన పారుల్‌ను వీధి కుక్కలు గాయపరిచాయి. ముఖం, మెడ, కాలి భాగాల్లో బాగా గాయాలయ్యాయి. దీంతో ఆమెను కోకిలాబెన్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పారుల్‌ అక్క మీడియాతో మాట్లాడుతూ తలపై మూడు సెంటీమీటర్లలోతు గాటు పడిందని, దీంతో ఆమెకు బుధవారం సర్జరీ చేస్తున్నారని చెప్పారు.