info@manadailynews.com
Breaking News

కంగన వీడియో లీకైంది

kangana leaked video

‘క్వీన్‌’, ‘తను వెడ్స్ మను’ వంటి సినిమాలతో ప్రేక్షకుల మదిని దోచుకున్న బాలీవుడ్ హీరోయిన్‌ కంగనా రనౌత్‌. షూటింగ్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె కాగితాలను ఎదురుగా ఉన్న బల్లపై విసిరేసింది. ఈ వీడియోలో ఆగ్రహంతో ఊగిపోతూ కనిపించింది. ఇప్పుడు ఈ వీడియో ఆన్‌లైన్‌లో హల్‌ చల్ చేస్తుండటంతో తాజాగా కంగనా ఈ వీడియో నిజమేనని వెల్లడించింది. ‘ఫెమినా’ మ్యాగజీన్‌ మార్చ్ ఎడిషన్ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈ అమ్మడు ఈ వీడియో నిజమేనని, తన పాత్రకు డూప్‌ పెట్టుకునే విషయంలో షూటింగ్ సిబ్బందిపై కోప్పడ్డానని ఆమె అంగీకరించింది. ‘ రీబక్‌ ప్రచారం కోసం నేను షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది.
విషయం ఏంటంటే.. నేను నా పాత్ర కోసం డూప్‌ పెట్టుకోవాలని భావించలేదు. ఆ విషయమై ఆ సంభాషణ జరిగింది’ అని కంగనా వివరణ ఇచ్చింది. ఇబ్బంది లేకుండా ఉండేందుకు డూప్‌ను పెట్టుకోవాలని యూనిట్ సిబ్బంది ఒకరు కోరడంతో అతనిపై కంగనా ఒంటికాలిపై లేవడం ఈ లీకైన వీడియోలో వినిపిస్తుంది. ‘నేను ఎందుకు డూప్‌ను పెట్టుకోవాలి. నేను డూప్‌ను పెట్టుకొని ఎప్పుడూ నటించను. నేనేం చేయాలో నాకు చెప్పొద్దు. డూప్‌ చేయగా నేను చేయలేనిది ఏముంది’ అంటూ ఆగ్రహంగా ఆమె కాగితాలను ఎదురుగా ఉన్న బల్లకేసి కొట్టడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో లీకవ్వడం పబ్లిసిటీ స్టంటేనని కొందరు కొట్టిపారేస్తుండగా మరికొందరు మాత్రం ఇలా లీక్ చేయడం సబబు కాదని అభిప్రాయపడుతున్నారు.