జూనియర్ ఎన్టీఆర్ నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై కల్యాణ్‌రామ్ నిర్మాణంలో ఓ కొత్త సినిమా రాబోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ మొదటిసారి త్రిపాత్రాభినయం చేయబోతున్నారు. ఈ సినిమా చిత్రీకరణకు ముహూర్తం కుదిరింది. ఫిబ్రవరి 10న పూజా కార్యక్రమాలు జరుపుకోని, ఫిబ్రవరి 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు తన ఫేస్బుక్ ద్వారా తెలిపారు నందమూరి కల్యాణ్‌రామ్. ఈ చిత్రానికి ‘జై.. లవ కుశ..’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. బాబి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంగా ‘జై.. లవ కుశ’
