info@manadailynews.com
Breaking News

టీ20 నుంచి యువరాజ్ ఔట్

yuvraj-singh-injury

టీ20 ప్రపంచకప్ నుంచి యువరాజ్ సింగ్ తప్పుకున్నాడు. వెస్టిండీస్ తో జరిగే సెమీస్ మ్యాచ్ కు దూరంగా ఉంటున్నాడు. ఆస్ట్రేలియాతో బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డ యువరాజ్ సింగ్ స్థానంలో మనీష్ పాండేను సెలెక్టర్లు ఎంపిక చేశారు. గాయం నుంచి కోలుకోలేదని డాక్టర్లు తెలిపారు. మరోవైపు సిడ్నీలో ఆసీస్ తో జరిగిన ఐదవ వన్డేలో చివరిగా ఆడిన పాండే తన తొలి సెంచరీని నమోదు చేసి సెలక్టర్లను ఆకట్టుకున్నాడు.   ఐపీఎల్ లో కూడా పాండే కు మంచి రికార్డు ఉంది. ఇదిలా ఉంటే వెస్టిండీస్ జట్టులో కూడా ఓ మార్పు చోటుచేసుకుంది. గాయపడ్డ ఫ్లెచర్ స్థానంలో ఆల్ రౌండర్ సిమ్మన్స్ ను తీసుకున్నారు.