info@manadailynews.com
Breaking News

దేశీయ స్టాక్ మార్కెట్లు దెబ్బేశాయి

sensex

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. యూరోపియన్ మార్కెట్లు భారి నుంచి అందిన ప్రతికూల సంకేతాలకు తోడు.. ఆర్ బీఐ తీసుకున్న నిర్ణయాలు మార్కెట్ ని దెబ్బతీశాయి. సెన్సెక్స్ 285 పాయింట్లు నష్టపోయి.. 24,539 దగ్గర ముగిసింది. నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయి.. 7,455 దగ్గర క్లోజయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర చివరి ద్వైమాసిక సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం బ్యాంకింగ్ రంగ షేర్లను కుంగదీసింది. బ్యాంక్ నిఫ్టీ ఆరున్నర శాతం నష్టపోగా  మెటల్ ఎక్కువగా 5 శాతం, మీడియా 3 శాతం నష్టపోయాయి. మిగిలిన అన్ని రంగాలు ఒక శాతానికి మించి నష్టపోయాయి.