info@manadailynews.com
Breaking News

భారత్-వెస్టిండీస్ నాలుగో టెస్ట్ రద్దు

indian team

వర్షం కారణంగా భారత్-వెస్టిండీస్ టెస్ట్ సీరీస్‌లో నాలుగో టెస్ట్‌ మ్యాచ్ రద్దయింది. దీంతో భారత్‌ 2-0తో సీరీస్ కైవసం చేసుకుంది. దీంతో  ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్ లో మొదటి స్థానాన్ని కోల్పోయింది. ఇదిలా ఉంటె ఇంగ్లాండ్‌తో జరిగిన సీరీస్‌ను పాక్ 2-2తో సమం చేసి పాకిస్థాన్ టాప్‌ర్యాంక్‌లోకి వచ్చింది. అటు ఆస్ట్రేలియాను శ్రీలంక 3-0తో చిత్తు చేసి సీరీస్‌ను కైవసం చేసుకుంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకుల ప్రకారం పాకిస్థాన్ తొలి ర్యాంక్‌లో, భారత్ రెండో స్థానంలో, ఆస్ట్రేలియా మూడో ర్యాంకులో, ఇంగ్లాండ్ నాలుగో స్థానంలో నిలిచాయి.