info@manadailynews.com
Breaking News

రేపు జరిగే భారత్-పాక్ మ్యాచ్‌ యుద్దంలా ఉంటుంది

india vs pakistan t20 world cup 19th march 2016

టీ20 ప్రపంచ కప్ పోటీల్లో న్యూజీలాండ్ చేతిలో ఓడిపోయిన భారత్‌పైనే ఒత్తిడి అధికంగా ఉందని పాకిస్తాన్  టీం కోచ్ వకార్ యూనిస్ అన్నారు. పాక్ ఇప్పటికే బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించి ఆధిక్యంలో ఉంది కాబట్టి తమపై అంతగా ఒత్తిడి లేదన్నారు. అయితే గత మ్యాచ్‌లో కూడా మేము ఒత్తిడికి గురికాలేదని భారత బౌలర్ అశ్విన్ తెలిపారు. తాము ఒత్తిడిని జయించి ఎలా ఆడగలమో చెప్పారు. ఇకపై ఆడబోయే ప్రతీ మ్యాచ్ లో భారత్ గెలుస్తుంది అన్నారు. భారత్-పాక్ మ్యాచ్‌ను ఫ్యాన్స్ ఓ ఆటలా కాకుండా సరిహద్దులో యుద్ధం జరుగుతున్నట్లుగా చూస్తారని అశ్విన్ చెప్పారు.