info@manadailynews.com
Breaking News

పాక్‌ను మట్టికరిపించిన మన కుర్రాళ్ళు

hockey-asia-cup

ఒక వైపు భారత్‌ సైన్యం పాక్‌ ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో చేస్తుంటే… ఇంకోవైపు పాకిస్తాన్ హాకీ జట్టును భారత్‌ కుర్రాళ్లు మట్టికరిపించారు. అండర్‌-18 ఆసియా కప్‌లో భాగంగా ఢాకాలో గురువారం జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ 3-1తేడాతో పాక్‌పై విజయఢంకా మోగించింది. భార‌త హాకీ కుర్రాళ్ళు ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నారు. బంగ్లాదేశ్ రాజ‌ధాని ఢాకా వేదిక‌గా జ‌రిగిన‌ ఆసియా క‌ప్ అండ‌ర్ 18 విభాగం సెమీస్‌లో దాయాది దేశం పాకిస్తాన్‌పై నెగ్గి.. ఆ విజ‌యాన్ని యూరీ ఘ‌ట‌న‌లో మ‌ర‌ణించిన అమర‌వీరుల‌కు అంకితం చేస్తామ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మాట ఇచ్చిన‌ట్లే చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాక్‌పై 3-1 తేడాతో విజ‌యం సాధించింది. యూరీ ఘ‌ట‌న‌తో  భార‌త్-పాక్‌ల మ‌ధ్య యుద్ధ‌వాతావ‌ర‌ణం నెలకొన్న నేప‌థ్యంలో దాయాదుల పోరు చాలా ఆస‌క్తిగా మారింది.