కాన్పూర్ లో జరుగుతున్నా భారత్ తన 500వ టెస్ట్‌లో భారత్ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. చివరి రోజు ఆటకు ఆరు వికెట్లు న్యూజిలాండ్ చేతిలో ఉండటంతో ఆ జట్టు కాస్త ధీమాగా ఉంది. అయితే ఆఖరి రోజు ఆట తొలి సెషన్లో భారత బౌలర్లు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ప్రత్యేకంగా ఈ సెషన్ లో రవీంద్ర జడేజా ఒక వికెట్ తీస్తే, పేసర్ మొహ్మద్ షమీ రెండు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు తీసి కివీస్‌ను చావు దెబ్బకొట్టాడు. దాంతో న్యూజిలాండ్ కు ఘోర పరాజయానికి స్వాగతం పలకగా, భారత్ ‘చారిత్రక’ విజయం సాధించింది.
434 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా ఓవర్‌నైట్ స్కోరు 93/4తో చివరి రోజైన సోమవారం బరిలోకి దిగిన కివీస్ ఆరంభంలోనే తడబడినా కివీస్ టాపార్డర్ ఆటగాడు ల్యూక్ రోంచీ(80; 120 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) ఐదో వికెట్ గా వెనుదిరిగాడు. మిగిలిన ఆటగాళ్లు కూడా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దాంతో రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 236 పరుగులకే కుప్పకూలడంతో భారత్‌కు 197 పరుగుల భారీ విజయం దక్కింది. భారత బౌలర్లలో అశ్విన్ ఆరు వికెట్లు సాధించి ప్రత్యర్థి జట్టును కొలుకోలేని దెబ్బ తీశాడు. షమీకి రెండు, జడేజాకు ఒక వికెట్ దక్కింది. కాగా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా రవీంద్ర జడేజా నిలిచాడు.
న్యూజిలాండ్‌పై భారత్ చారిత్రక విజయం
