ఐసీఐసీఐ బ్యాంక్ తక్కువ వడ్డీకే గృహరుణం ఇచ్చే పథకాన్ని ప్రారంభించింది. ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద చౌక ఇళ్ల నిర్మాణానికి నంది పలికింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు గరిష్ఠంగా రూ.6 లక్షల వరకు రుణం లభిస్తుంది. దీనిపై చెల్లించాల్సిన వడ్డీపై ఏడాదికి 6.5 శాతం రాయితీని నేషనల్ హౌసింగ్ బ్యాంక్(ఎన్‌హెచ్‌బీ) ఇస్తుంది. ఇందుకు అనుగుణంగా ఎన్హెచ్బీతో ఐసీఐసీఐ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటి వరకు కుటుంబంలో ఎవరి పేరు మీద ఇల్లు లేని అల్పాదాయ, వెనుకబడిన వర్గాల వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అలాగే బ్యాంకులు ఇస్తే రూ.12-15 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. కానీ వడ్డీ రాయితీ రూ.6 లక్షల వరకే పరిమితం చేయనున్నారు.
తక్కువ వడ్డీకే గృహ రుణాలు: ఐసీఐసీఐ బ్యాంక్
