info@manadailynews.com
Breaking News

రాజమండ్రిలో హైద్రాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

1y

మరో ఇద్దరికి తీవ్రగాయాలు
అతివేగమే ప్రమాదానికి కారణం

రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ రోడ్డులో బుధవారం తెల్లవారుజామున కారు బోల్తా పడడంతో హైదరాబాద్‌ గుడిమల్కాపూర్‌ మెహిదీపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దంగేటి వంశీకృష్ణ(35) మృతి చెందాడు. అతని స్నేహితులు ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. విశ్రాంత విజిలెన్స్‌ విభాగం మేనేజర్‌ మోహన్‌రావు కుమారుడైన వంశీ ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్నాడు. 3 నెలల క్రితం హైదరాబాద్‌ వచ్చాడు. మోరంపూడి సెంటర్‌ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వైపు వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్న బాలాజీ అతి వేగంగా కారుతో రిలయన్స్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలోని డివైడర్‌ను ఢీకొట్టాడు. వెంటనే కారు పది ఫల్టీలు కొట్టింది.యస్వీ మార్కెట్‌ జంక్షన్‌ వద్ద చెట్టును ఢీకొట్టి నుజ్జునుజ్జయింది. ఆ సమయంలో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్లినట్లు తెలుస్తోంది. కారు ఫల్టీలు కొట్టడంతో బాలాజీ, శ్రవణ్‌ చెల్లాచెదురుగా పడిపోయారు. తీవ్రమైన గాయాలతో బయటపడ్డారు. అయితే వంశీ సీటు బెల్టు పెట్టుకోవడంతో ఎటూ కదలకుండా ఉండిపోయాడు. దీంతో సంఘటన స్థలంలోనే అతను మృతి చెందాడు. ప్రమాదానికి గురైన కారు ఇంటెలిజెన్స్‌ డీఎస్పీకి చెందినదిగా పోలీసులు గుర్తించారు. బాలాజీ, శ్రవణ్‌ను ఆస్పత్రికి తరలించారు. బొమ్మురు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.